- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీకు మైండ్ దొబ్బిందా ? గంభీర్‌పై అశ్విన్ సీరియస్
అర్షదీప్ ను కాదని హర్షిత్ రాణాను ఎందుకు తీసుకుంటున్నారని సీరియస్ అయ్యారు అశ్విన్.

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై మరోసారి రవిచంద్రన్ అశ్విన్ సీరియస్ అయ్యారు. టీమిండియా ఓటమికి కారణం గంభీర్ అంటూ మండిపడ్డారు. టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య నిన్న రెండో టి20 జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో టీమిండియా దారుణంగా ఓడిపోయింది. అయితే ఈ ఓటమికి కారణం గౌతమ్ గంభీరని... అతడు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే ఈ పరిస్థితి నెలకొందని అశ్విన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్షదీప్ లేకపోవడం, బ్యాటింగ్ ఆర్డర్ మార్చడం వల్ల టీమిండియా ఓడిందన్నారు. టి20 మ్యాచ్ లో కచ్చితంగా అర్షదీప్ ఆడాల్సిందేనని పేర్కొన్నాడు.
కానీ అర్షదీప్ ను కాదని హర్షిత్ రాణాను ఎందుకు తీసుకుంటున్నారని సీరియస్ అయ్యారు అశ్విన్. నిన్నటి మ్యాచ్ లో అర్షదీప్ ఆడి ఉంటే, ఫలితం టీమ్ ఇండియాకు అనుకూలంగా వచ్చేదని పేర్కొన్నారు. 2024 టీ20 వరల్డ్ కప్ లో అత్యధిక వికెట్లు అర్షదీప్ సింగ్ తీసినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు 2026 టి20 వరల్డ్ కప్ దగ్గరికి వస్తోంది.. ఇలాంటి సమయంలో అర్షదీప్ సింగ్ కు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇలా అర్షదీప్ సింగ్ ను కాదని హర్షిత్ రాణాను తీసుకుంటే, టీమిండియా ఓడిపోవడం గ్యారంటీ అంటున్నారు. బుమ్రా తుది జట్టులో ఉంటే సెకండ్ బౌలర్ గా అర్షదీప్ ఉండాలని, బుమ్రా లేకపోతే అర్షదీప్ కీలక బౌలర్ అన్నారు అశ్విన్.






