Ashwin: టెస్ట్‌ కెప్టెన్‌గా అతడైతేనే బెస్ట్.. రవిచంద్రన్ అశ్విన్‌ సెన్సేషనల్ కామెంట్స్

by Kema Shiva Kumar |

భారత స్టార్ బ్యాట్స్‌మెన్స్ రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) లాంటి సీనియర్ ఆటగాళ్ల నిష్క్రమణతో భారత టెస్ట్ జట్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.

Ashwin: టెస్ట్‌ కెప్టెన్‌గా అతడైతేనే బెస్ట్.. రవిచంద్రన్ అశ్విన్‌ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత స్టార్ బ్యాట్స్‌మెన్స్ రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) లాంటి సీనియర్ ఆటగాళ్ల నిష్క్రమణతో భారత టెస్ట్ జట్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు జట్టు పగ్గాలు ఎవరు చేపడతారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో ఇంగ్లాండ్‌ (England)లో జరిగే ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు యంగ్ ట్యాలెంటెడ్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్‌ (Shubhman Gill)ను టెస్ట్ కెప్టెన్‌గా నియమిస్తారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, గతేడాది టెస్ట్ ఫార్మాట్‌లో భారత వైస్‌ కెప్టెన్‌గా ఉన్న శుభ్‌మన్ గిల్ 32 టెస్టుల్లో కేవలం 35 సగటుతో ఆశించిన స్థాయిలో రాణించ లేదు. మరోవైపు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)కు కెప్టెన్సీ భాధ్యతలు కట్టబెట్టాలని అనుకున్నా అతడు గాయాలతో సతమతమవుతున్నాడు. దీంతో రాబోయే ఇంగ్లాండ్ టూర్ భారత జట్టుకు ఓ పరీక్షగా మారనుంది.

ఈ క్రమంలోనే టెస్ట్ కెప్టెన్సీపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ప్రారంభం కాబోయే ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ (ICC Test Championship)ను దృష్టిలో పెట్టుకుని ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja)కు టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించాలని పేర్కొన్నాడు. జడేజా చాలా అనుభవం కలిగిన ఆటగాడని.. ఖచ్చితంగా అతడు కెప్టెన్సీ రేసులో ఉండాల్సిన వాడని అన్నారు. ఒకవేళ శుభ్‌మన్‌ గిల్‌ను సారథిగా ఎంపిక చేస్తే.. వైస్ కెప్టెన్‌గా జడేజాను ఎంపిక చేయాలని కామెంట్ చేశారు. తాను చెప్పింది వింతగా అనిపించవచ్చని.. కానీ రవీంద్ర జడేజా తనకు అప్పజెప్పిన ప్రతి పనికి న్యాయం చేయగలడని తెలిపారు. ఐపీఎల్-2025లో శుభ్‌మన్ గిల్ ప్రదర్శన ఊపునిచ్చిందని.. గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ అర్హత సాధిస్తుందని తాను ఆశిస్తున్నానని రవిచంద్రన్ అశ్విన్ అన్నారు.

Next Story