- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అశ్విన్ ఒక్కన్నే కాదు..మరో ఇద్దరిని కూడా వదిలించుకుంటున్న CSK!
రవిచంద్రన్ అశ్విన్ తో పాటు డెవన్ కాన్వే, రాహుల్ త్రిపాఠిని వదిలించుకోవాలి చెన్నై సూపర్ కింగ్స్ చూస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026 టోర్నమెంట్ కు (IPL 2026 ) ఇంకా దాదాపు ఎనిమిది నెలల సమయం ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పటినుంచే ఈ టోర్నమెంట్ పై అంచనాలు పెంచేస్తున్నారు. ఇందులో ఉన్న ప్లేయర్ ట్రేడింగ్ ద్వారా అందులోకి వెళ్తున్నారని... అందులో ఉన్న ప్లేయర్ ఇందులోకి వస్తున్నాడని అంటున్నారు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఉన్న రవిచంద్రన్ అశ్విన్ ( Ravichandran Ashwin).. రాజస్థాన్ లోకి వెళ్తారని ప్రచారం జోరు అందుకుంది.
అంతే కాదు... తనను వదిలేయాలని చెన్నై యాజమాన్యాన్ని అశ్విన్ కూడా కోరాడట. మొన్నటి మెగా వేలం సమయంలో 9.75 కోట్లకు అశ్విన్ ను సొంతం చేసుకుంది చెన్నై. అతన్ని ఈసారి వేలంలోకి వదిలే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఆ తర్వాత డెవన్ కాన్వే ను కూడా చెన్నై వదిలేసే అవకాశాలు ఉన్నాయి. మొన్నటి మెగా వేలం సమయంలో 6.25 కోట్లకు ఇతన్ని రిటైన్ చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్. కానీ మొదటి సీజన్ లో పెద్దగా రాణించలేదు.
దీంతో డెవన్ కాన్వే ను వదిలించుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ ప్లాన్ చేస్తోందట. అలాగే రాహుల్ త్రిపాఠి ని కూడా ఐపీఎల్ 2026 మినీ వేలంలో... వదిలివేయాలని చెన్నై సూపర్ కింగ్స్ ఓ నిర్ణయానికి వచ్చిందట. అతన్ని గతంలో 3.40 కోట్లకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. కానీ రాహుల్ త్రిపాఠి మాత్రం పెద్దగా రాణించలేదు. అందుకే అతన్ని వదిలించుకోవాలని చూస్తున్నారు.






