పాకిస్తాన్ కు అశ్విన్ మద్దతు...ఉస్మాన్ తారిక్ యాక్షన్‌పై తెరపైకి మ‌రో వివాదం !

by velandi.Saikiran |

ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ పై అందరు విమర్శలు చేస్తే అశ్విన్ మాత్రం అతనికి మద్దతుగా నిలిచాడు.

పాకిస్తాన్ కు అశ్విన్ మద్దతు...ఉస్మాన్ తారిక్ యాక్షన్‌పై తెరపైకి మ‌రో వివాదం !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టీ20 ప్రపంచ కప్ నడుస్తున్న నేపథ్యంలో సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. పాకిస్తాన్ బౌలర్ ఉస్మాన్ తారిక్ ( Pakistan spinner Usman Tariq ) చుట్టూ ఈ వివాదం రాజుకుంది. ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ పై సోషల్ మీడియాతో పాటు మాజీ క్రికెటర్లు కూడా తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి బౌలింగ్ పట్ల ఐసీసీ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా లేటెస్ట్ గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా ఉస్మాన్ తారిక్ అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టును గెలిపించాడు. దీంతో అతని బౌలింగ్ యాక్షన్ పై విమర్శలు వస్తున్నాయి.

ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ పై అశ్విన్ రియాక్షన్ ఇదే

టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో బౌలింగ్ చేస్తున్న ఉస్మాన్ తారిక్ పైన వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై భారత జట్టుకు సంబంధించిన మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ( Ashwin) తన స్టైల్లో స్పందించారు. ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ పై అందరు విమర్శలు చేస్తే అశ్విన్ మాత్రం అతనికి మద్దతుగా నిలిచాడు. పాకిస్తాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ అసలు కరెక్ట్ ఉందా? లేదా? అనే విషయంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సెంటర్ లోనే తేలుతుందని క్లారిటీ ఇచ్చారు అశ్విన్. అప్పటి వరకు అనవసరమైన రాద్ధాంతం సృష్టించకూడదని కోరారు.

పాకిస్తాన్ బౌలర్ ఉస్మాన్ తారిక్ ( Pakistan spinner Usman Tariq ) బౌలింగ్ చేసేటప్పుడు చెయ్యి 15 డిగ్రీల కంటే ఎక్కువ వంగుతుందా? లేదా? అనేది చూడాలి. ఈ విషయాన్ని అంపైర్లు కంటితో చూసి చెప్పలేరని వెల్లడించారు. దీనికి టెక్నాలజీ చాలా అవసరమని తెలిపారు మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. కానీ ఆ టెక్నాల‌జీ ప్ర‌స్తుతం అందుబాటులో లేద‌న్నారు. రూల్స్ లో ఉన్న ఈ వెసులుబాటను బౌలర్ వాడుకుంటే అది తప్పే కాదని కుండ బద్దలు కొట్టారు. ఇక క్రీజులో ఆగి బౌలింగ్ చేయడం అతని సహజమైన స్టైల్ అన్నారు. కానీ ఐసీసీ రూల్స్ ప్రకారం అతడు వేసే బౌలింగ్ 100కు 100% కరెక్ట్ అంటూ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. దీంతో రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

ఇది ఇలా ఉండగా... టీ20 ప్రపంచ కప్ 2026 లో భాగంగా ఇండియాతో పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 15వ తేదీన కొలంబో వేదికగా జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారు అయింది. అయితే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ ఆడితే... ఇండియా చాలా ఇబ్బంది పడే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పట్లో మెండిస్ ఇలాగే ఇండియాను వనికించి చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు ఉస్మాన్ తారిక్‌ కూడా అలాగే బౌలింగ్ చేసే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Next Story