- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ashes: రసవత్తరంగా పెర్త్ టెస్ట్.. 132 పరుగులకు ఆసిస్ ఆలౌట్
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య పెర్త్ వేదికగా జరుగుతోన్న తొలి టెస్ట్ రసవత్తరంగా కొనసాగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య పెర్త్ వేదికగా జరుగుతోన్న తొలి టెస్ట్ రసవత్తరంగా కొనసాగుతోంది. పేస్‌కు స్వర్గధామమైన పెర్త్ పిచ్ ధాటికి ఒకే రోజు 19 వికెట్లు నేలకూలాయి. ఇవాళ రెండో రోజు ఆట ప్రారంభం కాగానే ఆసిస్ జట్టు 132 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లాండ్ జట్టుకు తొలి ఇన్సింగ్స్‌లో 40 పరుగుల ఆధిక్యం లభించింది. బౌలర్లు పండగ చేసుకోవడంతో శుక్రవారం పెర్త్‌లో ఆరంభమైన తొలి టెస్టులో తొలి రోజే 19 వికెట్లు కూలాయి. అంతకు ముందు ఇంగ్లాండ్ జట్టు 172 పరుగులు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. మిచెల్ స్టార్క్ 58 పరుగులిచ్చి ఏకంగా 7 వికెట్లు తీశాడు. హ్యారీ బ్రూక్ (52; 61 బంతుల్లో 5×4, 1×6), ఒలీ పోప్ (46; 58 బంతుల్లో 4×4) రాణించారు. బెన్ స్టోక్స్ (5/23) విజృంభించడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్2, కార్స్ 2 వికెట్లతో రాణించారు.






