Ashes: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌.. ఇరు జట్లలో కీలక మార్పులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-04 03:59:21  IST  )

ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ (Ashes Series)లో రెండో టెస్ట్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది.

Ashes: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌.. ఇరు జట్లలో కీలక మార్పులు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ (Ashes Series)లో రెండో టెస్ట్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. బ్రిస్బేన్ (Brisbane) వేదికగా జరుగుతున్న ఈ డే-నైట్ పింక్ బాల్ టెస్ట్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ (Steve Smith) కూడా బ్యాటింగ్ చేయాలని ఆశించినా.. టాస్ ఓడిపోవడం అతడికి నిరాశ కలిగించింది.

ఇరు జట్లలో కీలక మార్పులు..

ఇంగ్లాండ్‌ జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయి. గాయం కారణంగా మార్క్ వుడ్‌ స్థానంలో విల్ జాక్స్‌ (Will Jacks)ను తుది జట్టులోకి తీసుకున్నారు. దాదాపు మూడేళ్ల తర్వాత విల్ జాక్స్ టెస్ట్ జట్టులో ఆడుతున్నాడు. మరోవైపు, షోయబ్ బషీర్‌కు బదులు విల్ జాక్స్‌ను తీసుకోవడం ద్వారా జట్టు బ్యాటింగ్‌ బలం పెరుగుతుందని కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు, ఆస్ట్రేలియా జట్టులో ఒకే ఒక్క మార్పు చేశారు. స్పిన్నర్ నాథన్ లయన్ స్థానంలో మిచెల్ నేసర్‌ను జట్టులోకి తీసుకున్నారు. కాగా, పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. ట్రావిస్ హెడ్ 69 బంతుల్లో సెంచరీ చేయడం, మిచెల్ స్టార్క్ 10 వికెట్లు తీయడం ఆ జట్టు విజయానికి కీలకంగా నిలిచింది.

ఆస్ట్రేలియా జట్టు: జేక్ వెదరాల్డ్, ట్రావిస్ హెడ్, మార్నస్ లాబుస్చాగ్నే, స్టీవెన్ స్మిత్ (C), కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కారీ (WK), మైఖేల్ నేజర్, మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్, బ్రెండన్ డాగెట్.

ఇంగ్లాండ్ జట్టు: జాక్ క్రాలే, బెన్ డౌసెట్, ఆలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్ట్రోక్స్ (C), జేమీ స్మిత్(WK), విల్ జాక్స్, గుడ్ అట్కిన్సన్, బ్రైడాన్ కార్స్, జోఫ్రీ ఆర్చర్.

Next Story