- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ashes: భారీ స్కోర్ దిశగా ఆస్ట్రేలియా.. ఏకంగా 155 పరుగుల ఆధిక్యం
యాషెస్ సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్ (Brisbane) వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా (Australia) భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: యాషెస్ సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్ (Brisbane) వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా (Australia) భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. జేక్ వెదరాల్డ్ (72), లబుషేన్ (65) రాణించడంతో శుక్రవారం మూడో సెషన్ కొనసాగుతోన్న వేళ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 490 పరుగులు చేసింది. మిచెల్ స్టార్క్ (76), స్కాట్ బోలాండ్ (15) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్, బ్రైడన్ కార్సే చెరో 3 వికెట్లు, జోఫ్రా ఆర్చర్, అట్కిన్‌సన్ చెరో వికెట్ తీసుకున్నారు. ఆసిస్ జట్టు తొలి ఇన్సింగ్స్‌లో 155 పరుగుల అధిక్యంలో ఉంది.
కాగా, ఉదయం 325/9తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్.. 334 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా ఆధిక్యంలోకి వెళ్లడంలో ఓపెనర్ వెదరాల్డ్ కీలక పాత్ర పోషించాడు. అలవోకగా పరుగులు రాబట్టిన అతడు 45 బంతుల్లోనే అర్ధశతకం సాధించడం విశేషం. హెడ్ (33)తో తొలి వికెట్‌కు 77 పరుగులు జోడించిన వెదరాల్డ్.. లబుషేన్‌తో రెండో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యంతో ఆసీస్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.






