Arshdeep Singh : టీ20ల్లో అరుదైన ఫీట్‌కు చేరువలో అర్ష్‌దీప్ సింగ్

by Sathputhe Rajesh |

భారత బౌలర్ అర్ష్ దీప్ సింగ్ మరో అరుదైన ఫీట్‌కి చేరువయ్యాడు.

Arshdeep Singh : టీ20ల్లో అరుదైన ఫీట్‌కు చేరువలో అర్ష్‌దీప్ సింగ్
X

దిశ, స్పోర్ట్స్ : భారత బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ మరో అరుదైన ఫీట్‌కి చేరువయ్యాడు. టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా 96 వికెట్లతో యజ్వేందర్ చహల్ టాప్‌లో ఉన్నాడు. కాగా, అర్ష్‌దీప్ సింగ్ మొత్తం 58 మ్యాచ్‌ల్లో 89 వికెట్లు తీసుకున్నాడు. మరో 8 వికెట్లు పడగొడితే భారత్ తరఫున టీ20 ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా చరిత్ర లిఖించనున్నాడు. ఈ 25 ఏళ్ల సీమ్ బౌలర్ 2022లో ఇంగ్లాండ్‌తో సౌత్‌అంప్టన్‌లో జరిగిన మ్యాచ్‌తో టీ20ల్లో అరంగేట్రం చేశాడు. ఆ ఏడాదిలో 33 వికెట్లు పడగొట్టాడు. 2023లో 26 వికెట్లు తీశాడు. 2024లో ఇప్పటి వరకు 30 వికెట్లు పడగొట్టాడు. సౌతాఫ్రికాతో సిరీస్‌లో ఇప్పటి వరకు ప్రభావం చూపని ఈ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ చివరి రెండు మ్యాచ్‌ల్లో సత్తా చాటితే టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలవనున్నాడు.

Next Story