నా ప్లేయర్ అంటే అలాగే ఉండాలి.. అర్ష్‌దీప్‌కు గంభీర్ మద్దతు

by Harish |

నా ప్లేయర్ అంటే అలాగే ఉండాలి.. అర్ష్‌దీప్‌కు గంభీర్ మద్దతు
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో భారత బౌలర్ అర్ష్‌దీప్ సింగ్.. రనౌట్ చేసేందుకు బంతి విసరగా అది మిచెల్‌కు బలంగా తాకిన విషయం తెలిసిందే. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మ్యాచ్ అనంతరం మిచెల్‌కు అర్ష్‌దీప్ క్షమాపణలు చెప్పానని తెలిపాడు. అలాగే,ఐసీసీ కూడా అర్ష్‌దీప్‌కు మ్యాచ్ ఫీజులో 15 శాతం కోతపెట్టింది. ఆ ఘటనపై భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందిస్తూ.. అర్ష్‌దీప్‌కు మద్దతుగా నిలిచాడు. అర్ష్‌దీప్ చేసిందాంట్లో తప్పు లేదని సమర్థించాడు. ‘దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు దూకుడు తప్పనిసరి. బంతిని త్రో బ్యాక్ చేస్తే తప్పా?. ఏ బౌలర్ రెండు సిక్సర్లు ఇవ్వడం ఇష్టపడడు.నా ప్లేయర్ల నుంచి అలాంటి స్పందననే కోరుకుంటా. అందులో ఎలాంటి తప్పు లేదు. అర్ష్‌దీప్ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు. అతను చెప్పడం అతనికి మంచిదే. కానీ, క్రికెట్ మైదానంలో స్నేహితులు, శత్రువులు ఉండరు. మీ పని దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. దేశాన్ని గెలిపించడం.’అని గంభీర్ చెప్పుకొచ్చాడు.


Next Story