- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బుమ్రా రికార్డు బద్దలు.. టి20 లో అర్షదీప్ సరికొత్త రికార్డు
జింబాబ్వేపై 3 వికెట్లు తీసిన అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా రికార్డును బద్దలు కొట్టాడు.

దిశ, వెబ్ డెస్క్: భారత ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ ( Arshdeep Singh) సరికొత్త చరిత్ర సృష్టించాడు. డేంజర్ బౌలర్ బుమ్రా రికార్డును బద్దలు కొట్టి, టీ20 వరల్డ్ కప్ చరిత్రలో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశాడు అర్షదీప్ సింగ్. సూపర్ 8 లో భాగంగా భారత్, జింబాబ్వేతో తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ సందర్భంగా జింబాబ్వేకు సంబంధించిన మూడు కీలక వికెట్లు పడగొట్టాడు అర్షదీప్ సింగ్. ఈ నేపథ్యంలోనే బుమ్రా రికార్డును బ్రేక్ చేశాడు అర్షదీప్.
33 వికెట్లు సాధించిన భారత బౌలర్ బుమ్రా రికార్డును, 35 వికెట్లతో అధిగమించి మొదటి స్థానానికి చేరుకున్నాడు. 19 మ్యాచ్‌లలోనే అర్షదీప్ సింగ్ ఈ ఘనత సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డు టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అర్షదీప్ క్రియేట్ చేయగా... అంతర్జాతీయ క్రికెట్ లో 150 వికెట్ల మైలురాయిని కూడా దాటేశాడు. దీంతో అర్షదీప్ సింగ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
జింబాబ్వే పై ఇండియా గ్రాండ్ విక్టరీ
సూపర్ 8 లో ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ ను భారత జట్టు సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో జింబాబ్వేపై ఏకంగా 72 పరుగులు తేడాతో విజయం సాధించింది భారత జట్టు. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 256 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో జింబాబ్వే 184 పరుగుల వద్ద ఆగిపోయింది. దీంతో జింబాబ్వే ఇంటికి వెళ్ళగా, భారత్ సేఫ్ జోన్ లోకి వచ్చింది.






