బుమ్రా కాదు.. టీమిండియా ప్రీమియర్ బౌలర్ అతనే : అశ్విన్

by Harish |

టీ20ల్లో టీమిండియాకు అర్ష్‌దీప్ సింగే ప్రీమియర్ బౌలర్ అని భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు.

బుమ్రా కాదు.. టీమిండియా ప్రీమియర్ బౌలర్ అతనే : అశ్విన్
X

దిశ, స్పోర్ట్స్ : టీ20ల్లో టీమిండియాకు అర్ష్‌దీప్ సింగే ప్రీమియర్ బౌలర్ అని భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ఆసియా కప్‌లో శ్రీలంకతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్ సూపర్ ఓవర్‌లో గెలిచిన విషయం తెలిసిందే. సూపర్ ఓవర్ వేసిన అర్ష్‌దీప్ కేవలం రెండే రన్స్ ఇవ్వడంతో విజయం తేలిక అవ్వగా.. సూర్య తొలి బంతికే 3 పరుగులు తీసి గెలుపు లాంఛనం చేశాడు. ఈ క్రమంలోనే అర్ష్‌దీప్‌పై అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. తన యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడుతూ.. టీ20ల్లో భారత్‌‌కు అర్ష్‌దీప్ చాలా కీలకమన్నాడు. ‘ఆసియా కప్‌‌కు ముందే భారత జట్టులో అతను ఎంత కీలకమవుతాడో చెప్పాను. ఇప్పుడు అదే రుజువైంది. సూపర్ ఓవర్‌లో బౌలింగ్ చేసిన తీరుతో తాను ఎంత ముఖ్యమో చాటిచెప్పాడు. టీమిండియా ప్రీమియర్ బౌలర్లలో తాను ఒక్కడినని నిరూపించాడు. బుమ్రా జట్టులో ఉంటే ఎవరూ అర్ష్‌దీప్ సింగ్ గురించి మాట్లాడేవారు కాదు. కానీ, టీ20 ఫార్మాట్‌లో నా వరకు అర్ష్‌దీపే ప్రీమియర్ బౌలర్. టీ20ల్లో 100 వికెట్లు తీశాడు.’అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.


Next Story