నదీమ్‌తో ఫ్రెండ్‌షిప్‌పై నీరజ్ కీలక వ్యాఖ్యలు

by Harish |

పాకిస్తాన్ జావెలిన్ త్రోయర్, పారిస్ ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ అర్షద్ నదీమ్‌తో అనుబంధంపై భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా స్పందించాడు.

నదీమ్‌తో ఫ్రెండ్‌షిప్‌పై నీరజ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్ జావెలిన్ త్రోయర్, పారిస్ ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ అర్షద్ నదీమ్‌తో అనుబంధంపై భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా స్పందించాడు. శుక్రవారం జరిగే దోహా డైమండ్ లీగ్‌లో నీరజ్ పాల్గొనబోతున్నాడు. గురువారం నిర్వహించి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో నీరజ్ మాట్లాడుతూ.. నదీమ్‌తో తనకు బలమైన బంధం లేదని, తాము క్లోజ్ ఫ్రెండ్స్ కాదన్నాడు. భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు మునపటిలా ఉండకపోవచ్చన్నాడు. అయితే, ఎవరైనా తనకు గౌరవం ఇచ్చి మాట్లాడితే తాను కూడా అలాగే వ్యవహరిస్తానని చెప్పాడు. ‘క్రీడాకారులుగా మేము మాట్లాడుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా జావెలిన్ త్రోలోనే కాకుండా అథ్లెటిక్స్ కమ్యూనిటీలో నాకు మంచి స్నేహితులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ తమ దేశం కోసం పోటీపడతారు. ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలనుకుంటారు.’అని నీరజ్ తెలిపాడు. కాగా, నీరజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్‌కు నదీమ్‌ను ఆహ్వానించడంతో నీరజ్ చోప్రా విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అథ్లెట్లను ఆహ్వానించినట్టే నదీమ్‌ను ఇన్వైట్ చేశామని, అంతే తప్ప ఇంకా లేదని నీరజ్ ఇటీవల క్లారిటీ ఇచ్చాడు.


Next Story