ఐపీఎల్ టికెట్ల దందా.. జగన్ తో పాటు మరో 5 గురు అరెస్ట్ !

by velandi.Saikiran |   (  Updated:2025-07-10 04:33:47  IST  )

ఐపీఎల్ టికెట్ల దందాలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే HCA అధ్యక్షుడు జగన్ మోహన్ రావు అరెస్టు అయ్యారు. ఇప్పుడు ఈ

ఐపీఎల్ టికెట్ల దందా.. జగన్ తో పాటు మరో 5 గురు అరెస్ట్ !
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ టికెట్ల దందాలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే HCA అధ్యక్షుడు జగన్ మోహన్ రావు అరెస్టు అయ్యారు. ఇప్పుడు ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ మోహన్ రావుతో పాటు సుశీల్ కంటే, జనార్థన్ రావు, ట్రెజరర్ శ్రీనివాసరావు, మాజీ మంత్రి కృష్ణ యాదవ్ తమ్ముడు, మరదలు అరెస్టు అయ్యారు. నిందితులపై 406, 409, 403, 468, 471, 420 సెక్షన్ల కింద సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ తరుణంలోనే జగన్ మోహన్ రావుతో పాటు మరో 5 గురు అరెస్ట్ అయ్యారు.

ఇది ఇలా ఉండగా HCA క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు నిన్న అరెస్ట్ అయ్యారు. SRH, HCA మధ్య ఐపీఎల్ టికెట్ల వివాదంలో సీఐడీ చర్యలు తీసుకుంటోంది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఇటీవల కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు అధికారులు. HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు మరో 5 గురిని తాజాగా అరెస్టు చేశారు. SRH ఫ్రాంఛైజీపై HCA అధ్యక్షుడు ఒత్తిడి చేసినట్లు విజిలెన్స్ నిర్ధారించడంతో తాజా పరిణామం చోటు చేసుకుంది.

Next Story