అర్జున్ టెండూల్కర్ కంటే సానియా అంత పెద్దదా.. ఏజ్ గ్యాప్ ఎంత అంటే ?

by velandi.Saikiran |   (  Updated:2025-08-14 15:13:37  IST  )

అర్జున్ కూడా అలాగే తనకంటే పెద్దదైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

అర్జున్ టెండూల్కర్ కంటే సానియా అంత పెద్దదా.. ఏజ్ గ్యాప్ ఎంత అంటే ?
X

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా మాజీ ఆటగాడు సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ గురించి తెలియని వారు ఉండరు. సచిన్ టెండూల్కర్ తరహాలోనే టీమిండియాలోకి వచ్చి.. సక్సెస్ కావాలని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు అర్జున్ టెండూల్కర్. అయితే అలాంటి యంగ్ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్... ఎంగేజ్మెంట్ కార్యక్రమం నిన్న చాలా సైలెంట్ గా జరిగినట్లు తెలుస్తోంది. రహస్యంగానే ఈ కార్యక్రమాన్ని సచిన్ టెండూల్కర్ నిర్వహించారని చెబుతున్నారు.

ముంబై కి సంబంధించిన రవి ఘాయ్ అనే బడా వ్యాపారవేత్త మనవరాలు సానియా చందోక్ తో అర్జున్ టెండూల్కర్ ఎంగేజ్మెంట్ జరిగిందని చెబుతున్నారు. ఈ సానియా ఓ ప్రముఖ ఆసుపత్రిలో... వైద్యురాలుగా కూడా పనిచేస్తున్నట్లు కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దాదాపు 600 కోట్ల వరకు వీళ్ళ కుటుంబ ఆస్తులు ఉంటాయని చెబుతున్నారు. అయితే ఇక్కడ ప్రత్యేక విషయం ఏంటంటే ప్రస్తుతం అర్జున్ టెండూల్కర్ వయసు 26 సంవత్సరాలు.

అతనికంటే సానియా ఒక సంవత్సరం పెద్దదని తెలుస్తోంది. దీనికి సంబంధించిన కథనాలు నేషనల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే సచిన్ టెండూల్కర్, ఆయన భార్య అంజలి మధ్య ఏజ్ గ్యాప్ కూడా చాలా ఉందన్న సంగతి తెలిసిందే. వాళ్ళిద్దరి మధ్య దాదాపు 5 నుంచి 6 సంవత్సరాలు గ్యాప్ ఉంటుందట. సచిన్ కంటే అంజలి పెద్దదన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అర్జున్ కూడా అలాగే తనకంటే పెద్దదైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

Next Story