- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముంబై ఇండియన్స్ నుంచి అర్జున్ ఔట్...ఇక కెరీర్ ముగిసినట్టే ?
అర్జున్ టెండూల్కర్ కు ముంబై ఇండియన్స్ యాజమాన్యం షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది

Arjun Tendulkar
దిశ, వెబ్ డెస్క్: అర్జున్ టెండూల్కర్ కు ముంబై ఇండియన్స్ యాజమాన్యం షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ట్రేడ్ టాక్స్ ద్వారా అర్జున్ టెండూల్కర్ ను వదిలించుకోవాలని స్కెచ్ వేసింది. లక్నోకు అర్జున్ ను అప్పగించి, ఆ జట్టుకు చెందిన శార్దుల్ ఠాకూర్ ను ముంబైలోకి తీసుకురావాలని నీతా అంబానీ ప్లాన్ వేసినట్లు కథనాలు వస్తున్నాయి. ఈ మేరకు రెండు జట్ల మధ్య చర్చలు కూడా జరుగుతున్నట్లు సమాచారం.
అటు ఇప్పటికే ముంబై ఇండియన్స్ తో శార్దుల్ ఠాకూర్ కు డీల్ కుదిరినట్లు రవిచంద్రన్ అశ్విన్ ఓ ఇంటర్వ్యూలో కూడా వెల్లడించారు. ఇదే నిజమైతే వచ్చే సీజన్ లో ముంబై నుంచి శార్దుల్ ఠాకూర్, లక్నో తరఫున బరిలోకి అర్జున్ టెండూల్కర్ దిగుతాడు. ముంబై ఇండియన్స్ లోనే అర్జున్ టెండూల్కర్ తుది జట్టులో ఛాన్స్ సరిగ్గా రాలేదు.
అలాంటిది లక్నో జట్టులోకి వెళితే, అతనికి ఛాన్స్ రావడం కష్టమే అని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. దానికి తోడు లక్నో యాజమాన్యం కూడా ప్లేయర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ ఉంటుంది. సరైన ప్రదర్శన కనబరచకపోతే, అర్జున్ టెండూల్కర్ ఆ జట్టులో కొనసాగడం కష్టమే అంటున్నారు. ఆ జట్టులో ఉంటే అతని కెరీర్ కూడా ప్రమాదంలో పడుతుందని అంచనా వేస్తున్నారు.






