6వ సారి FIFA WC ఫైనల్‌ చేరిన అర్జెంటీనా

by Malleboina Mahesh |   (  Updated:2022-12-14 02:12:19  IST  )

2022 FIFA వరల్డ్ కప్ మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ అర్జెంటీనా.. క్రొయేషియా మధ్య జరిగింది. కాగా ఈ మ్యాచ్ పూర్తి సమయంలో అర్జెంటీనా 3-0 తేడాతో క్రొయేషియా ను ఓడించింది.

6వ సారి FIFA WC ఫైనల్‌ చేరిన అర్జెంటీనా
X

దిశ, వెబ్‌డెస్క్: 2022 FIFA వరల్డ్ కప్ మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ అర్జెంటీనా.. క్రొయేషియా మధ్య జరిగింది. కాగా ఈ మ్యాచ్ పూర్తి సమయంలో అర్జెంటీనా 3-0 తేడాతో క్రొయేషియా ను ఓడించింది. దీంతో అర్జెంటీనా ప్రపంచకప్ ఫైనల్ కు చేరుకుంది. ఈ జట్టు ఫైనల్ చేరుకోవడం ఇది 6వ సారి కావడం విశేషం. కీలకమైన సెమి ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా తరఫున లియోనెల్ మెస్సీ ఒకసారి, జూలియన్ అల్వారెజ్ రెండు గోల్స్ చేశారు. పురుషుల ప్రపంచకప్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా లోథర్ మాథ్యూస్ రికార్డును మెస్సీ సమం చేశాడు (25). మెస్సీ ప్రపంచ కప్ చరిత్రలో (11 గోల్స్) అర్జెంటీనాకు ఆల్ టైమ్ లీడింగ్ గోల్స్ స్కోరర్ అయ్యాడు.

Also Read....

స్మృతి మంధాన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకింగ్

Next Story