ప‌లాష్ తో స్మృతి మ‌ళ్లీ డేటింగ్‌..పోస్టులు వైర‌ల్ !

by velandi.Saikiran |

పలాష్ ముచ్చల్ తో ఏడడుగులు నడిచేందుకు స్మృతి మందాన నిర్ణయం తీసుకున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ప‌లాష్ తో స్మృతి మ‌ళ్లీ డేటింగ్‌..పోస్టులు వైర‌ల్ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: భారత లేడీ కోహ్లీ స్మృతి మందాన యూటర్న్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పలాష్ ముచ్చల్ తో ఏడడుగులు నడిచేందుకు స్మృతి మందాన నిర్ణయం తీసుకున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ జంట పెళ్లి, పీటలపైనే ఆగిపోయింది. స్మృతి మందాన తండ్రికి గుండెపోటు వచ్చిందని అర్ధాంతరంగా పీటలపైన పెళ్లి ఆపేశారు. ఆ తర్వాత వీళ్ళ పెళ్లి క్యాన్సిల్ కావడానికి అనేక కారణాలు ఉన్నాయని వార్తలు వైరల్ అయ్యాయి. పలాష్ ముచ్చల్ మరో అమ్మాయితో పెళ్లి కంటే ఒక్కరోజు ముందు దొరికిపోయాడని వార్తలు కూడా వచ్చాయి.

ప‌లాష్ - స్మృతి పెళ్లి చేసుకోబోతున్నారా ?

మొత్తానికి ఈ ఇద్దరు విడిపోయి ఎవరి లైఫ్ వాళ్ళు గడిపేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో తాజాగా పలాష్ చెల్లెలితో స్మృతి మందాన తండ్రి కనిపించాడు. దీంతో స్మృతి మందాన, పలాష్ మధ్య గొడవ సద్దుమణిగిందని, త్వరలో ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వైరల్ చేస్తున్నారు. పలాష్ పైన కోపాన్ని తగ్గించుకున్న స్మృతి, తన తండ్రిని రంగంలోకి దింపినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే పలాష్ ఇంటికి వెళ్లి పెళ్లి గురించి స్మృతి మందాన తండ్రి మాట్లాడినట్లు చెబుతున్నారు. ఈ మేరకు పోస్టులు వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. మొత్తానికి ప్రచారం అయితే జోరుగా సాగుతోంది.

Next Story