నేడు తొలి ఎలిమినేషన్... ఆస్ట్రేలియాకు ఎలిమినేష‌న్ టెన్ష‌న్‌ ?

by velandi.Saikiran |

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆస్ట్రేలియాకు డూ ఆర్ డై ప‌రిస్థితి నెల‌కొంది. శ్రీలంక‌, ఒమ‌న్ జ‌ట్ల‌పై త‌ప్ప‌క గెల‌వాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది.

నేడు తొలి ఎలిమినేషన్... ఆస్ట్రేలియాకు ఎలిమినేష‌న్ టెన్ష‌న్‌ ?
X

*ఆస్ట్రేలియాకు డూ ఆర్ డై ప‌రిస్థితి*

*శ్రీలంక‌, ఒమ‌న్ జ‌ట్ల‌పై త‌ప్ప‌క గెల‌వాల్సిందే*

దిశ‌, వెబ్ డెస్క్‌: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 నేపథ్యంలో ఆస్ట్రేలియాకు ( Australia ) ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. గ్రూప్ స్టేజ్ లో జింబాబ్వే చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయింది ఆస్ట్రేలియా. ఈ రెండు జట్ల మధ్య శుక్రవారం ఫైట్ జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియాపై 23 పరుగుల తేడాతో విజయం సాధించింది పసికూన జింబాబ్వే ( Zimbabwe). దీంతో అంతర్జాతీయంగా ఆస్ట్రేలియా పరువు పోయింది.

సూపర్ 8 కు ఆస్ట్రేలియా చేరడం కష్టమే

జింబాబ్వే చేతిలో చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియాకు ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. టీ20 వరల్డ్ కప్ 2026 లో సూపర్ 8కు వెళ్లాలంటే చాలా కష్టపడాలి. రాబోయే ప్రతి మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. తన తర్వాతి మ్యాచ్ లలో శ్రీలంక, ఒమన్ లపై ఆస్ట్రేలియా కచ్చితంగా గెలవాలి. ఒకవేళ ఒక్క మ్యాచ్ లో ఓడినా మిగిలిన జట్ల ప్రదర్శన పై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. దీంతో ఆస్ట్రేలియా పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లుగా తయారైంది.

ఇక ఈ టోర్నమెంట్లో శనివారం 3 కీలక మ్యాచ్ లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ ఐర్లాండ్, ఒమన్ జట్ల మధ్య ఉంటుంది. ఇందులో ఓడిన జట్టు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెండవ మ్యాచ్ ఇంగ్లాండ్, స్కాట్లాండ్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. సాయంత్రం ఏడు గంటలకు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ ఉంటుంది. ఈ రెండు మ్యాచ్ లో ఫలితాలు పాయింట్లు పట్టికలో ఆయా జట్ల స్థానాలను ప్రభావితం చేయనున్నాయి.

Next Story