- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విరాట్ కోహ్లీ ఔట్.. అనుష్క శర్మ రియాక్షన్ చూడండి
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో ( IPL 2025) భాగంగా మంగళవారం రోజున రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB ) వర్సెస్ లక్నో ( LSG)

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో ( IPL 2025) భాగంగా మంగళవారం రోజున రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB ) వర్సెస్ లక్నో ( LSG) మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ( Virat Kohli) వికెట్ కోల్పోయిన తర్వాత... ఆయన సతీమణి అనుష్క శర్మ ( Anushka Sharma) రియాక్షన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
లక్నో పైన కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 30 వంతుల్లోనే 54 పరుగులు చేసి దుమ్ములేపాడు విరాట్ కోహ్లీ. ఇందులో 10 బౌండరీలు కూడా ఉన్నాయి. అయితే మ్యాచ్ మంచి ఊపులో ఉన్న సమయంలోనే... లక్నో బోర్డర్ ఆవేష్ ఖాన్ బౌలింగ్ లో చెత్త షాట్ ఆడి ఔట్ అయ్యాడు. ఇక విరాట్ కోహ్లీ క్యాచ్ ను బదోని అందుకున్నాడు. ఈ నేపథ్యంలోనే... కోహ్లీ భార్య అనుష్క శర్మ చాలా డిసప్పాయింట్ అయ్యారు.
అంతకుముందు విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేసిన నేపథ్యంలో... చప్పట్లతో ఎంకరేజ్ చేశారు. వికెట్ కోల్పోయిన తర్వాత మాత్రం అనుష్క శర్మ బాధపడుతూ కనిపించారు. ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ లో మూడు రికార్డులు క్రియేట్ చేశాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరుపున 9000 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్ గా కూడా రికార్డు సృష్టించాడు. అలాగే ఒకే సీజన్లో 600కు పైగా ఎక్కువసార్లు పరుగులు చేసిన ఆటగాడిగా కూడా చరిత్ర సృష్టించాడు.






