ఓడిన అక్కసుతో భారత బాక్సర్‌తో గొడవ పడ్డ యూఎస్ ప్లేయర్!

by Phanindra |

దుబాయ్ వేదికగా జరిగిన మిస్‌ఫిట్స్ బాక్సింగ్ 23 ఈవెంట్‌లో భారత్‌ను అవమానించి, ఆ తర్వాత భారతీయుడి చేతిలోనే ఓడిపోయాడు యూఎస్ బాక్సర్.

ఓడిన అక్కసుతో భారత బాక్సర్‌తో గొడవ పడ్డ యూఎస్ ప్లేయర్!
X

దిశ, స్పోర్ట్స్: భారత్‌కు చెందిన బాక్సర్ నీరజ్ గోయట్.. యూఎస్ ప్టేయర్ ఆంథనీ టేలర్ మధ్య గొడవ జరిగింది. దుబాయ్ వేదికగా జరిగిన మిస్‌ఫిట్స్ బాక్సింగ్ 23 ఈవెంట్‌లో వీళ్లిద్దరూ తలపడ్డారు. ఈ మ్యాచులో నీరజ్ గెలిచినా.. ఆంథనీ షేక్ హ్యాండ్ ఇస్తుంటే తీసుకోలేదు. ఈ గొడవ బ్యాక్ స్టేజీలో కూడా కొనసాగింది. ఇద్దరూ ఒకరిని ఒకరు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసుకున్నారు. ఈ క్రమంలో తన చేతిలో ఉన్న బాటిల్‌ను నీరజ్ మీదకు విసిరాడు ఆంథనీ. దీంతో సహనం కోల్పోయిన నీరజ్.. కొట్టాకు సిద్ధమయ్యాడు. ఇది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది, నీరజ్ మేనేజర్ వెంటనే కలగజేసుకొని పరిస్థితిని చక్కదిద్దినట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌కు ముందు బాక్సింగ్‌లో భారత్ స్థాయిని టేలర్ కించపరిచాడు. అందుకే అతన్ని ఓడించిన తర్వాత షేక్ హ్యాండ్‌ ఇస్తుంటే నీరజ్ తీసుకోలేదని సమాచారం.

Next Story