క్రికెట్‌లో మరో సంచలనం.. పాక్ దిగ్గజం వసీం అక్రమ్‌పై కేసు నమోదు

by Kema Shiva Kumar |

క్రికెట్‌లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.

క్రికెట్‌లో మరో సంచలనం.. పాక్ దిగ్గజం వసీం అక్రమ్‌పై కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్‌లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. పాక్ మాజీ ఆటగాడు, ప్రఖ్యాత లెఫ్ట్‌ ఆర్మ్ పేసర్ వసీం అక్రమ్‌ (Wasim Akram)పై తాజాగా ఆయన స్వదేశంలో కేసు నమోదైంది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ (Online Betting App)లను ప్రోత్సహిస్తున్నందు‌కు ఆయనపై సైబర్ క్రైమ్ (Cyber Crime) విభాగంలో ఎఫ్ఐఆర్ బుక్ అయింది. పాకిస్తాన్‌లో బెట్టింగ్ యాప్స్ పూర్తిగా నిషేధించినా.. వసీం అక్రమ్ నిబంధనలు అతీక్రమించి ఓ విదేశీ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌‌కు ప్రచారం చేశాడంటూ మహ్మద్ ఫయాజ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఎలక్ట్రానిక్ క్రైమ్స్‌ యాక్ట్-2016 ప్రకారం కేసు నమోదైంది. అయితే, ఈ విషయంలో వసీం అక్రమ్ ఇప్పటికీ వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం ఆయన అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. పాక్ క్రికెట్‌లో వెలుగు వెలిగిన అక్రమ్‌‌ ఇలా కేసులో చిక్కుకోవడం అతడి పరువు, ప్రతిష్టకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని క్రీడా విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.

Next Story