- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరోసారి వక్రబుద్ధి చాటుకున్న మొహ్సిన్ నఖ్వీ.. ఆసియా కప్ ట్రోఫీని రహస్య ప్రదేశానికి తరలింపు
ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) ప్రెసిడెంట్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ మరోసారి తన వక్రబుద్ధి చూపెట్టాడు.

దిశ, స్పోర్ట్స్ : ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) ప్రెసిడెంట్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ మరోసారి తన వక్రబుద్ధి చూపెట్టాడు. ఆసియా కప్ ట్రోఫీని భారత్‌కు ఇవ్వకుండా నాటకాలు ఆడుతున్న అతను ట్రోఫీని అబుదాబిలోని గుర్తు తెలియని ప్రాంతానికి తరలించినట్టు తెలుస్తోంది. ఆసియా కప్ గెలిచి దాదాపు నెల రోజులు అవుతున్నా ట్రోఫీ, మెడల్స్‌కు ఇంకా భారత జట్టుకు అందజేయలేదు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి భారత ఆటగాళ్లు నిరాకరించారు. ఏసీసీ ప్రెసిడెంట్‌గా హుందాగా ప్రవర్తించాల్సిన నఖ్వీ ట్రోఫీని తనవెంటే తీసుకెళ్లడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దీనిపై బీసీసీఐ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
ట్రోఫీని ఏసీసీ కార్యాలయంలో ఉంచిన నఖ్వీ.. భారత జట్టుకు ట్రోఫీకి కావాలంటే ఏసీసీ ఆఫీస్‌కు వచ్చి తన చేతుల మీదుగా తీసుకోవాలని మొండిపట్టు పట్టాడు. ఆ తర్వాత కూడా పలు షరతులు పెట్టడం చర్చనీయాంశమైంది. తాజాగా నఖ్వీ మరో వివాదానికి తెరలేపాడు. ఏసీసీ కార్యాలయంలో ఉన్న ట్రోఫీని పూర్తిగా తన స్వాధీనంలోకి తీసుకున్నాడని, అబుదాబిలోని రహస్య ప్రాంతానికి తరలించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల బీసీసీఐ అధికారి ఒకరు ఏసీసీ కార్యాలయానికి వెళ్లడంతో ఈ విషయం బయటపడింది. ‘కొన్ని రోజుల క్రితం బీసీసీఐ అధికారి ఏసీసీ హెడ్‌క్వార్టర్స్‌కు వచ్చారు. ట్రోఫీకి గురించి ఆరా తీశారు. ట్రోఫీని ఏసీసీ కార్యాలయం నుంచి తరలించారని సిబ్బంది చెప్పారు. అబుదాబిలోని ఓ ప్రాంతంలో నఖ్వీ అదుపులో ఉందని చెప్పారు.’అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నఖ్వీ తీరుపై సీరియస్‌గా ఉన్న బీసీసీఐ ఈ విషయాన్ని ఐసీసీకి ఫిర్యాదు చేయాలని భావిస్తున్నది.






