మరో.. 'భారతీయుడి' విశ్వరూపం! ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు!

by Geesa Chandu |   (  Updated:2024-08-31 13:37:21  IST  )

6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టడమంటే ఎవరికీ అంతా ఈజీ కాదు. ఎందరో దిగ్గజ క్రికెటర్లు, గొప్ప ప్లేయర్లకు సైతం ఈ టాస్క్ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.

మరో.. భారతీయుడి విశ్వరూపం! ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు!
X

దిశ, వెబ్ డెస్క్: 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టడమంటే ఎవరికీ అంతా ఈజీ కాదు. ఎందరో దిగ్గజ క్రికెటర్లు, గొప్ప ప్లేయర్లకు సైతం ఈ టాస్క్ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే క్రికెట్ లో ఓనమాలు నేర్చుకుంటున్న ప్రియాంష్ ఆర్య అలవోకగా 6 బంతుల్లో 6 సిక్సులు బాది ఈ ఘనత సాధించాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఈ యువ ఆటగాడు రికార్డును నమోదు చేశాడు. భారత్ లో యువరాజ్ సింగ్ తర్వాత ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన ఆటగాడిగా ఆర్య చరిత్రను సృష్టించాడు.

ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో భాగంగా శుక్రవారం(ఆగస్టు 30) రాత్రి సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్, నార్త్ ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ లో.. సూపర్ స్టార్స్ తరఫున ఆడిన ఆర్య, స్పిన్నర్ మనన్ భరద్వాజ్ బౌలింగ్ లో ఈ ఘనత సాధించాడు. భరద్వాజ్ వేసిన తొలి బంతిని లాంగాఫ్ దిశగా సిక్సర్ బాదగా, ఆ తర్వాత వేసిన మూడు బంతులను లాంగాన్ దిశలో, ఐదో బంతిని స్ట్రైక్ సిక్సర్ గా, చివరి బంతిని మాత్రం మళ్లీ లాంగాఫ్ కు తరలించాడు ప్రియాంష్ ఆర్య.

Next Story