- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్చరీలో ఆసియా చాంపియన్‌గా తెలుగు కుర్రాడు ధీరజ్
ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో తెలుగు కుర్రాడు, విజయవాడకు చెందిన బొమ్మదేవర ధీరజ్ అదరగొట్టాడు.

దిశ, స్పోర్ట్స్ : ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో తెలుగు కుర్రాడు, విజయవాడకు చెందిన బొమ్మదేవర ధీరజ్ అదరగొట్టాడు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న టోర్నీలో పురుషుల రికర్వ్ వ్యక్తిగత ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ సాధించి ఆసియా చాంపియన్‌గా అవతరించాడు. శుక్రవారం జరిగిన ఫైనల్ ధీరజ్ 6-2 తేడాతో మరో భారత ఆర్చర్ రాహుల్‌ను ఓడించాడు. నాలుగు సెట్లలో జరిగిన పోరులో ధీరజ్ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించాడు. రెండు సెట్లలో గెలవగా మరో రెండు సెట్లను డ్రా చేసుకున్నాడు. ఆసియా చాంపియన్‌షిప్‌లో ధీరజ్ బంగారు పతకం సాధించడం ఇదే తొలిసారి. రాహుల్ రజత పతకం దక్కించుకున్నాడు. గురువారం తెలుగమ్మాయి వెన్నెం జ్యోతి సురేఖ వ్యక్తిగత, టీమ్ ఈవెంట్స్‌లో గోల్డ్ మెడల్స్ గెలిచిన విషయం తెలిసిందే.
మహిళల రికర్వ్ వ్యక్తిగత ఈవెంట్‌లో అంకిత భట్ గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. ఫైనల్‌లో ఆమె 7-3 తేడాతో పారిస్ ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్ నామ్ సు హ్యోన్(సౌత్ కొరియా)పై గెలిచింది. అదే ఈవెంట్‌లో మరో భారత క్రీడాకారిణి సంగీత కాంస్య పతకం సాధించింది. బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో సంగీత 6(10*)-5(10) తేడాతో సహచర క్రీడాకారిణి దీపిక కుమార్‌పై విజయం సాధించింది. మరోవైపు, రికర్వ్ పురుషుల టీమ్ ఈవెంట్‌లో భారత జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్‌లో యశదీప్ సంజయ్, అథాన్ దాస్, రాహుల్‌తో కూడిన భారత త్రయం 5-4తేడాతో సౌత్ కొరియా టీంను ఓడించి బంగారు పతకం దక్కించుకుంది. ఆసియా చాంపియన్‌షిప్‌లో సత్తాచాటిన భారత ఆర్చర్లు చివరిరోజైన శుక్రవారం ఐదు పతకాలు సాధించి ఘనంగా ముగింపు పలికారు. ఈ టోర్నీలో భారత్ మొత్తం 10 పతకాలు సాధించింది. అందులో ఆరు బంగారు పతకాలు ఉండటం విశేషం. మరో మూడు రజతాలు, ఒక్క కాంస్య పతకం ఉన్నాయి.






