- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
US Open : ఫైనల్‌కు దూసుకెళ్లిన సబలెంక, అనిసిమోవా
యూఎస్ ఓపెన్‌లో ఉమెన్స్ సింగిల్స్ ఫైనలిస్ట్‌లు ఎవరో తేలిపోయింది.

దిశ, స్పోర్ట్స్ : సీజన్ చివరి టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్ చివరి దశకు చేరుకుంది. ఉమెన్స్ సింగిల్స్‌లో ఇద్దరు ఫైనలిస్ట్‌లు ఎవరో తేలిపోయింది. డిఫెండింగ్ చాంపియన్ సబలెంక మరోసారి టైటిల్ రేసులో నిలువగా.. అమెరికా స్టార్ అనిసిమోవా తొలిసారిగా ఫైనల్‌లో అడుగుపెట్టింది. వీరిద్దరి మధ్య ఆదివారం టైటిల్ పోరు జరగనుంది. మరోవైపు, పురుషుల డబుల్స్‌లో భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ యుకీ బాంబ్రీ సంచలన పోరాటం ముగిసింది. యుకీ-మైఖేల్ వీనస్ జంట సెమీస్‌లో ఓడి టోర్నీ నుంచి నిష్ర్కమించింది.
వరల్డ్ నం.1 క్రీడాకారిణి సబలెంక మరోసారి యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచేందుకు అడుగు దూరంలో నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఆమెకు టోర్నీలో ఎదురులేకుండా పోయింది. వరుసగా రెండోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో అమెరికా ప్లేయర్ జెస్సికా పెగులాకు చెక్ పెట్టింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సబలెంక 4-6, 6-3 6-4 తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌లో శుభారంభం పెగులాదే. తొలి సెట్‌ను నెగ్గి సబలెంకను టెన్షన్ పెట్టింది. అనంతరం కమ్ బ్యాక్ ఇచ్చిన సబలెంక.. పెగులా ఆశలపై నీళ్లు చల్లింది. వరుసగా 2, 3 సెట్లలో నెగ్గి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. సబలెంక 8 ఏస్‌లు, 43 విన్నర్లు కొట్టి ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించింది. మూడు సార్లు బ్రేక్ పాయింట్ పొందింది. మరోవైపు, సబలెంకతో పోలిస్తే పెగులా తక్కువ తప్పిదాలే చేసిన అవకాశాలను అందిపుచ్చుకోవడంలో విఫలమై మ్యాచ్‌ను సమర్పించుకుంది.
మరోవైపు, జపాన్ క్రీడాకారిణి నవోమి ఒసాకాకు నిరాశే మిగిలింది. సెమీస్‌లో ఆమెకు అమెరికాకు చెందిన అనిసిమోవా షాకిచ్చింది. నువ్వానేనా అన్నట్టు సాగిన మ్యాచ్‌లో అనిసిమోవా 6-7(4-7), 7-6(7-3), 6-3 తేడాతో ఒసాకాను ఓడించింది. ఇద్దరు దాదాపు మూడు గంటలపాటు పోరాడటం గమనార్హం. తొలి సెట్ నుంచి ఇద్దరూ నువ్వానేనా అన్నట్టు తలపడ్డారు. తొల రెండు సెట్లు టై బ్రేకర్‌లోనే తేలాయంటే ఇద్దరు ఏ విధంగా పోరాడారో అర్థం చేసుకోవచ్చు. తొలి సెట్ ఒసాకా నెగ్గితే.. రెండో సెట్ అనిసిమోవా గెలిచింది. దీంతో మ్యాచ్ నిర్ణయాత్మక మూడో సెట్‌కు వెళ్లగా అక్కడ మాత్రం అనిసిమోవా సత్తాచాటింది. ఒసాకాను ఓడించి తొలిసారిగా యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ ఏడాది వింబుల్డన్ ఫైనల్‌లో బోల్తా పడిన ఆమె యూఎస్ ఓపెన్‌తో తొలి గ్రాండ్‌స్లామ్ గెలవాలని చూస్తున్నది.
సెమీస్‌లో యుకీ జోడీ ఇంటిదారి
భారత టెన్నిస్ ప్లేయర్ యుకీ బాంబ్రీ చరిత్ర సృష్టించడానికి కొద్ది దూరంలో ఆగిపోయాడు. పురుషుల డబుల్స్‌లో మైఖేల్ వీనస్(న్యూజిలాండ్)తో కలిసి సంచలన విజయాలు సాధించిన అతను సెమీస్‌లో బోల్తా పడ్డాడు. ఇంగ్లాండ్‌కు చెందిన నీల్ స్కుప్సీ-జో సాలిస్‌బరీ జోడీ చేతిలో 7-6(7-2), 6-7(5-7), 4-6 తేడాతో యుకీ జంట ఓడిపోయింది. విజయం కోసం యుకీ, వీనస్ గట్టిగానే పోరాడారు. తొలి సెట్ నెగ్గి శుభారంభం చేశారు. కానీ, ఆ తర్వాత ప్రత్యర్థులు పుంజుకోవడంతో వారికి ఓటమి తప్పలేదు.






