SRH ఓనర్ కావ్య మారన్‌ పెళ్ళి ఫిక్స్...వ‌రుడు ఎవ‌రంటే!

by velandi.Saikiran |

SRH ఓనర్ కావ్య మారన్‌ పెళ్ళి ఫిక్స్ అయిన‌ట్లు వార్త‌లు అవుతున్నాయి.

SRH ఓనర్ కావ్య మారన్‌ పెళ్ళి ఫిక్స్...వ‌రుడు ఎవ‌రంటే!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఐపీఎల్ 2026 కొనసాగుతున్న నేపథ్యంలో SRH ఓనర్ కావ్య మారన్ గురించి ఆసక్తికర న్యూస్ వైరల్ గా మారింది. ఆమె అతి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారట. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ ను ఆమె పెళ్లి చేసుకోబోతున్న సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అప్పట్లోనే ఈ ఇద్దరి మధ్య రిలేషన్ ఉందని, సీక్రెట్ గా ప్రేమించుకుంటార‌ని ప్ర‌చారం జ‌రిగింది. విదేశాల్లో ఈ జంట తిరిగిన ఫోటోలు వైర‌ల్ చేశారు. వీళ్లు పెళ్లి చేసుకుంటారని కూడా అప్పట్లో సోష‌ల్ మీడియా కోడై కూసింది. ఆ త‌ర్వాత అది రూమ‌ర్ అని తేలింది. ఇక ఇప్పుడు మళ్లీ అదే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కావ్య మారన్, అనిరుధ్ పెళ్లి పెద్ద‌ల స‌మ‌క్షంలోనే జ‌రుగ‌నున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది.

రంగంలోకి సూప‌ర్ స్టార్ రజినీకాంత్

ఇరు కుటుంబాల మధ్య చర్చలు కూడా జరుగుతున్నాయట. అన్ని కుదిరితే ఈ ఏడాది చివరలో కావ్య, అనిరుద్ పెళ్లి జ‌రుగుతుంద‌ని తమిళ ఇండస్ట్రీలో ఓ న్యూస్ చెక్కర్లు కొడుతోంది. ఈ జంటను కలిపేందుకు స్వయంగా సూపర్ స్టార్ రజినీకాంత్ రంగంలోకి దిగినట్లు టాక్ నడుస్తోంది. అనిరుధ్ రవి చందర్ కు వరుసకు మావయ్య అవుతాడు ర‌జినీ. ఈ క్రమంలో వీళ్లిద్దరి పెళ్లి చేసేందుకు ఆయన రంగంలోకి దిగారని అంటున్నారు. కళానిధి మారన్ తో రజనీకాంత్ ఇప్పటికే మాట్లాడినట్టు తెలుస్తోంది. స్వయంగా రజనీకాంత్ వచ్చిన నేపథ్యంలో కళానిధి మారన్ కూడా నో చెప్పలేదని అంటున్నారు. ఈ ఇద్దరి పెళ్లిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని ప్రచారం జోరు అందుకుంది.


Next Story