- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోహ్లీ స్థానంలో కరుణ్‌ను ఇంగ్లండ్‌కు పంపాలంటున్న కుంబ్లే
కోహ్లీ రిటైరవడంతో అతని స్థానంలో ఎవర్నీ ఇంగ్లండ్‌కు పంపాలని ఆలోచనలు మొదలయ్యాయి. కుంబ్లే అయితే కరుణ్ నాయర్‌కు ఓటేశాడు.

దిశ, స్పోర్ట్స్: స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రిటైర్‌మెంట్ ప్రకటించడంతో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే టీమిండియాలో నాలుగో నెంబర్ ప్లేయర్ ఎవరనే సందిగ్ధం నెలకొంది. ఈ క్రమంలో ఇటీవలి కాలంలో దేశవాళీల్లో అద్భుతంగా ఆడిన కరుణ్ నాయర్‌ను ఇంగ్లండ్ టూర్‌కు పంపాలని, కోహ్లీ స్థానాన్ని అతనే భర్తీ చెయ్యగలడని అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డాడు.
‘దేశవాళీ ఫామ్‌ను బట్టి కరుణ్‌కు ఒక అవకాశం ఇవ్వాలి. అలాగే జట్టులో అనుభవం ఉన్న ప్లేయర్లు ఉండటం కూడా అవసరం కదా. ఇంగ్లండ్‌లో ఆడిన అనుభవం ఉన్న వాళ్లయితే ఇంకా మంచిది. కరుణ్ చాలాకాలం కౌంటీ క్రికెట్ ఆడాడు. కాబట్టి అతన్ని నాలుగో నెంబర్ కోసం ఎంపిక చేస్తే మంచిది’ అని కుంబ్లే చెప్పుకొచ్చాడు. ‘సాయి సుదర్శన్ వంటి కుర్రాళ్లు కూడా అందుబాటులో ఉన్నారు. కానీ తను ఓపెనింగ్ చేస్తాడని అనుకుంటున్నా. ఇప్పుడు కరుణ్ వంటి వారికి అవకాశం ఇస్తే కుర్రాళ్లలో కూడా దేశవాళీల్లో రాణించాలనే తపన పెరుగుతుందన్నాడు.






