చివరి మ్యాచ్ ఆడేసిన ఆండ్రీ రస్సెల్... వీడియో వైరల్

by velandi.Saikiran |

టి20 స్పెషలిస్ట్, వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు ఆండ్రీ రస్సెల్ ( Andre Russell ) తన చివరి మ్యాచ్ ఆడేశాడు. ఇటీవల అంతర్జా

చివరి మ్యాచ్ ఆడేసిన ఆండ్రీ రస్సెల్... వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్ : టి20 స్పెషలిస్ట్, వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు ఆండ్రీ రస్సెల్ ( Andre Russell ) తన చివరి మ్యాచ్ ఆడేశాడు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఆండ్రీ రస్సెల్ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి నేపథ్యంలో తాజాగా ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య రెండో టి20 మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా క్రికెట్ కు వీడ్కోలు పలికాడు ఆండ్రీ రస్సెల్.

అయితే రిటైర్మెంట్ సందర్బంగా చివరి మ్యాచ్ ఆడిన ఆండ్రీ రస్సెల్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియా అలాగే వెస్టిండీస్ ప్లేయర్లు ఆండ్రీ రస్సెల్ కు గాడ్ ఆఫ్ హానర్ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా చివరి మ్యాచ్ లో కూడా ఆండ్రీ రస్సెల్ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు.. 240 స్ట్రైక్ రేట్ తో 15 బంతుల్లోనే 36 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సిక్సర్లు అలాగే రెండు బౌండరీలు ఉన్నాయి. కానీ ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ దారుణంగా ఓడిపోయింది.

Twitter -Link

Next Story