- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Andre Russell: ఆండ్రీ రస్సెల్ రిటైర్‌మెంట్ !
క్రికెట్ అభిమానులకు మరో ఊహించని షాక్ తగిలింది. ఈ సంవత్సరం ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రక

దిశ, వెబ్ డెస్క్: క్రికెట్ అభిమానులకు మరో ఊహించని షాక్ తగిలింది. ఈ సంవత్సరం ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించగా... మరో విధ్వంసకర ఆటగాడు కూడా తప్పుకున్నాడు. వెస్టిండీస్ భయంకర ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించేశాడు. వెస్టిండీస్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య స్వదేశంలో.. ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ జరగనుంది.
ఇందులో సెలెక్ట్ అయిన ఆండ్రీ రస్సెల్... కేవలం రెండు టి20 మ్యాచ్ లు ఆడనున్నాడు. ఆ మ్యాచులు పూర్తయిన తర్వాత రిటైర్మెంట్ తీసుకోబోతున్నాడు ఆండ్రీ రాసేల్. 37 సంవత్సరాలు ఉన్న ఆండ్రీ రస్సెల్ ( Andre Russell )... జమైకా సబీనా పార్కులోని హోమ్ గ్రౌండ్ లో జరిగే తొలి రెండు మ్యాచ్ లు ఆడి వీడ్కోలు పలకనున్నాడు. ఈ విషయాన్ని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కూడా స్పష్టం చేసింది. అయితే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్న తండ్రి ఆండ్రీ రస్సెల్ ( Andre Russell Retirement).. దేశీయ టి20 లీగుల్లో మాత్రం... ఆడనున్నాడు.
అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో కూడా ఆడతాడు అన్నమాట. దీంతో కేకేఆర్ అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇది ఇలా ఉండగా వెస్టిండీస్ తరఫున ఇప్పటి వరకు 84 టీ20 మ్యాచ్ లు ఆడాడు ఆండ్రీ రస్సెల్. ఇందులో 163 స్ట్రైక్ రేటుతో 1078 పరుగులు చేశాడు. అంతేకాదు మూడు హాఫ్ సెంచరీలు కూడా నమోదు చేసుకున్నాడు. టి20 లలో 71 పరుగులు అతని హైయెస్ట్ స్కోర్. అదే సమయంలో 61 వికెట్లు పడగొట్టాడు.






