- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Anderson-Tendulkar Trophy : అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ ఆవిష్కరణ
భారత్ ఇంగ్లండ్(India-England) మధ్య జరిగే టెస్ట్ క్రికెట్ సిరీస్ కు ఐసీసీ(ICC) అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ(Anderson-Tendulkar Trophy)గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : భారత్ ఇంగ్లండ్(India-England) మధ్య జరిగే టెస్ట్ క్రికెట్ సిరీస్ కు ఐసీసీ(ICC) అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ(Anderson-Tendulkar Trophy)గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని నేడు జేమ్స్ ఆండర్సన్(James Anderson), సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) లు ఆవిష్కరించారు. తమ పేరుతో ఇస్తున్న ట్రోఫీని చూసి ఇద్దరూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ట్రోఫీకి కొత్త నామకరణం చేయాలని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) మరియు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిర్ణయించగా.. టెస్ట్ క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్(టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు - 15,921), జేమ్స్ అండర్సన్ (టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్ - 704)ల సేవలను గౌరవిస్తూ వారిద్దరి పేర్లు కలిసి వచ్చేలా పెట్టారు.
గతంలో ఈ సిరీస్‌ను ఇంగ్లండ్‌లో ‘పటౌడీ ట్రోఫీ’, భారత్‌లో ‘ఆంథోనీ డి మెల్లో ట్రోఫీ’గా పిలిచేవారు. అయితే జూన్ 14న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ సందర్భంగా లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఈ ట్రోఫీని ఆవిష్కరించాల్సి ఉన్నప్పటికీ అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం నేపథ్యంలో, నేటికి వాయిదా వేశారు. కాగా ఈ సిరీస్ జూన్ 20 నుంచి ఇంగ్లండ్‌లోని హెడింగ్లీ (లీడ్స్) వేదికగా ప్రారంభమవుతుంది.






