- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RCB: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరు మార్పు !
RCB పేరులో ఎలాంటి మార్పు ఉండబోదని యజమానులలో ఒకరైన అనన్య బిర్లా క్లారిటీ ఇచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కొత్త ఓనర్ షిప్ వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో బెంగుళూరు జట్టు పేరు మార్చుతారని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారానికి RCB యజమానులలో ఒకరైన అనన్య బిర్లా ( Ananya Birla) క్లారిటీ ఇచ్చారు. RCB పేరులో ఎలాంటి మార్పు ఉండబోదని కుండబద్దలు కొట్టి చెప్పారు. ఇక పైన కూడా పాత పేరుతో జట్టు కొనసాగుతుందని ప్రకటన చేశారు.
దీంతో బెంగళూరు అభిమానులు సంబరపడిపోతున్నారు. ఇది ఇలా ఉండగా, RCB జట్టును రూ.16,706 కోట్లకు ఆదిత్య బిర్లా, బ్లాక్ స్టోన్, డేవిడ్ బ్లేజర్, TOI కొనుగోలు చేశారు. మార్చి 31వ తేదీన RCB జట్టును టేకోవర్ చేసుకోబోతున్నారు. కాగా ఐపీఎల్ 2026 నేపథ్యంలో బెంగళూరు తన తొలి మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ చిన్న స్వామి స్టేడియం వేదికగా నిర్వహించనున్నారు.






