- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెంచరీ మిస్...ఇషాన్ కిషన్ కన్నీళ్లు, ఫోటోలు వైరల్ !
రాయ్ పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధించింది.

దిశ, వెబ్ డెస్క్: భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో ఇషాన్ కిషన్ ( Ishan Kishan) అద్భుతంగా రాణించాడు. చివరి క్షణంలో భారత టీ20 జట్టులో స్థానం దక్కించుకున్న ఇషాన్ కిషన్, రెండో టీ20లో అదరగొట్టాడు. కేవలం 32 బంతుల్లో 76 పరుగులు సాధించాడు ఇషాన్. అయితే, సెంచరీ చేయకుండానే ఇషాన్ కిషన్ ఔట్ అయ్యాడు.
ఈ తరుణంలోనే ఇషాన్ కిషన్ ఎమోషనల్ అయ్యాడు. దీంతో మరో ఎండ్ లో బ్యాటింగ్ చేస్తోన్న కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ వెంటనే, ఇషాన్ ను హగ్ చేసుకుని ఓదార్చాడు. అటు పెవీలియన్ కు వెళ్లిన ఇషాన్ ను మిగిలిన ప్లేయర్లు, కోచ్ లు ప్రశంసించారు ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.
కివీస్ కు షాక్.. భారత్ రెండో విజయం
రాయ్ పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ను చిత్తు చేసింది సూర్య సేన. 208 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు ముందు ఉంచింది న్యూజిలాండ్. అయితే, ఆ లక్ష్యాన్ని చాలా అవలీలగా ఛేదించింది భారత జట్టు. దీంతో 0-2 తేడాతో సిరీస్ లో మరింత ముందుకు వెళ్లింది. ఇక ఈ రెండు జట్ల మధ్య మరో 3 మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. అటు తొలిసారిగా టీ20 లలో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు.






