Kohli రిటైర్మెంట్‌పై Afridi కీలక వ్యాఖ్యలు.. స్ట్రాంగ్ కౌంటర్‌తో నోరుమూయించిన మిశ్రా

by Satheesh |   (  Updated:2022-09-14 12:55:35  IST  )

Amit Mishra TROLLS Ex-Pak Cricketer Shahid Afridi Over His 'Virat Kohli Should Retire' Comment

Kohli  రిటైర్మెంట్‌పై Afridi కీలక వ్యాఖ్యలు.. స్ట్రాంగ్ కౌంటర్‌తో నోరుమూయించిన మిశ్రా
X

దిశ, వెబ్‌డెస్క్: రిటైర్మెంట్ గురించి టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిది అఫ్రిదీ కీలక సూచనలు చేశాడు. కోహ్లీ ఫామ్‌లో ఉన్నప్పుడే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని.. అలా కాకుండా సెలెక్టర్లు జట్టు నుండి తప్పించినప్పుడు రిటైర్మెంట్ ప్రకటించొద్దని సలహా ఇచ్చాడు. తాజాగా ఈ వ్యాఖ్యలపై టీమిండియా మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా స్పందించి.. అఫ్రిదీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ''ప్రియమైన అఫ్రిదీ.. కొంతమంది క్రికెట్ నుండి ఒక్కసారి మాత్రమే రిటైర్ అవుతారు.. కాబట్టి దయచేసి ఇలాంటి సలహాలు కోహ్లీకి ఇవ్వకండి.. వీటన్నింటి నుండి విరాట్ కోహ్లీని తప్పించండి'' అని మిశ్రా కౌంటర్ ఇచ్చాడు. దీంతో నెటిజన్లు అఫ్రిదీని ఆడుకుంటున్నారు. క్రికెటర్లు అందరూ అఫ్రిదీలా చాలాసార్లు రిటైర్మెంట్ ఇవ్వరని.. ఉచిత సలహాలు ఇవ్వొద్దని కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. ఇక, ఈ పాక్ మాజీ కెప్టెన్ షాహీది అఫ్రిదీ అంతర్జాతీయ క్రికెట్‌కు చాలాసార్లు రిటైర్మెంట్ ప్రకటించి.. మళ్లీ వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే.

Next Story