- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోహ్లీ చేసిన పని వల్ల మరో వందేళ్లు క్రికెట్‌ను మనమే పాలిస్తాం!
కోహ్లీ చేసిన పని వల్ల మరో వందేళ్లు క్రికెట్‌ను మనమే పాలిస్తాం అని, అతని సేవను ఎవరూ గుర్తించడం లేదని అంబటి రాయుడు అన్నాడు.

దిశ, స్పోర్ట్స్: ప్రపంచ క్రికెట్‌ను మరో వందేళ్లు భారత్ ఏలుతుందని, దీనికి కారణం విరాట్ కోహ్లీనేనని అంబటి రాయుడు అన్నాడు. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన రాయుడు.. భారత క్రికెట్‌పై కోహ్లీ ఎంత ప్రభావం చూపించాడో వివరించాడు. కోహ్లీ వంటి ప్లేయర్ మరొకరు లేరన్న రాయుడు.. అతను తెచ్చిన మార్పుల వల్ల మరో వందేళ్లపాటు భారత్ ఈ క్రీడలో రాజ్యమేలుతుందని అభిప్రాయపడ్డాడు. ‘భారత క్రికెట్‌కు కోహ్లీ చేసిన సేవ ఇంకెవరూ చెయ్యలేదు. ఆ విలువను చాలామంది అర్థం చేసుకోరు.
నేను కేవలం తన బ్యాటింగ్ గురించి మాట్లాడటం లేదు. తన బ్యాటింగ్ చాలా గొప్పగా ఉంటుంది. అదే టైంలో తన ఫిట్‌నెస్ గురించి చెప్పుకోవాలి. అంతకుముందు ఆటగాళ్లలో చాలామంది సాధారణ ఫిట్‌నెస్‌తో ఉండేవాళ్లు. అది వాళ్లకు సహజంగా వచ్చింది. అయితే కోహ్లీ వల్ల భారత క్రికెట్ మరో స్థాయికి చేరింది. జట్టులో ఫిట్‌నెస్ స్థాయి పెరగడంతో క్రికెట్‌ను మరో వందేళ్లు ఈ క్రీడను పాలించే స్థాయికి భారత క్రికెట్ చేరింది’ అని రాయుడు అన్నాడు. కోహ్లీ ఇంకొంతకాలం టెస్టులు ఆడి ఉంటే బాగుండేదని, రిటైర్ అయిన తర్వాత తను సంతోషంగా ఉన్నాడని భావిస్తున్నానని చెప్పుకొచ్చాడు.
రోహిత్ కెప్టెన్‌గా ఉండాలి..
2027 వరల్డ్ కప్‌లో కూడా జట్టుకు రోహిత్ సారధ్యం వహించాలని రాయుడు కోరుకున్నాడు. వన్డే వరల్డ్ కప్ సాధించే సత్తా ఉన్న కెప్టెన్ అని, అప్పటి వరకు రోహిత్ ఆడుతుంటే మాత్రం కచ్చితంగా తనే జట్టును ముందుండి నడిపించాలని అన్నాడు. అలాగే వైట్‌బాల్ క్రికెట్‌లో రోహిత్ స్థానాన్ని భర్తీ చేయడం ఎవరికీ అంత సులభం కాదని, అందుకే 2027 వరకు రోహిత్ ఆడితేనే మంచిదని పేర్కొన్నాడు.






