- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HCA కొత్త అధ్యక్షుడిగా అమర్‌నాథ్.. ఉత్తర్వులు జారీ చేసిన అంబుడ్స్‌మన్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) కొత్త ప్రెసిడెంట్‌గా అమర్‌నాథ్ (Amarnath) నియమితులయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) కొత్త ప్రెసిడెంట్‌గా అమర్‌నాథ్ (Amarnath) నియమితులయ్యారు. ఈ మేరకు ఇవాళ బీసీసీఐ అంబుడ్స్‌మన్ నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. మాజీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు (Jaganmohan Rao) అరెస్ట్ అయ్యాక గత 9 నెలలుగా హెచ్‌సీఏ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. ఈ క్రమంలోనే తనను హెచ్‌సీఏ అధ్యక్షుడిగా నియమించాలంటూ ఇటీవలే అమర్‌నాథ్ అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించారు. ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న అంబుడ్స్‌మన్, అమర్‌నాథ్‌ను హెచ్‌సీఏ అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
గత ఎన్నికల్లో ఓటు తేడాతో ఓటమి..
అక్టోబర్ 20, 2023న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో ‘యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్‌సీఏ’ ప్యానెల్ అభ్యర్థి జగన్‌మోహన్ రావు తన సమీప ప్రత్యర్థి అమర్‌నాథ్‌పై కేవలం ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. మొత్తం అసోసియేషన్‌లో 173 ఓట్లు ఉండగా, 169 ఓట్లు పోల్ అయ్యాయి. అందులో జగన్‌మోహన్ రావుకు 63 ఓట్లు రాగా, అమర్‌నాథ్‌కు 62 ఓట్లు వచ్చాయి. దీంతో నాడు జగన్‌మోహన్ రావు హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు.






