- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమన్‌జోత్ విజయం వెనుక కుటుంబ త్యాగం.. ఎంతో బాధను దిగమింగి..
తొలిసారిగా ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టుపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిస్తున్నాయి.

దిశ, స్పోర్ట్స్ : తొలిసారిగా ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టుపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిస్తున్నాయి. భారత ప్లేయర్లు ఈ అపూర్వ విజయం సాధించడం వెనుక వారి కుటుంబాల త్యాగం కూడా ఉంది. ఆల్‌రౌండర్ అమన్‌జోత్ కౌర్ ప్రపంచకప్‌లో సత్తాచాటాలని ఆమె కుటుంబం ఎంతో బాధను దిగమింగింది. అమన్‌జోత్‌కు ఆమె నాన్నమ్మ భగవంతి(75) ఎంతో ప్రోత్సాహం ఇచ్చేది. ప్రపంచకప్ ప్రారంభమైన తర్వాత ఆమె గుండెపోటుకు గురయ్యారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు అమన్‌జోత్‌కు చెప్పలేదు. ఆమె ఆటపై ఫోకస్ కోల్పోకూడదని ఈ విషయాన్ని ఆమెకు చెప్పకుండా దాచారు.
తాజాగా అమన్‌జోత్ తండ్రి భూపిందర్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘అమన్‌జోత్ క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పటి నుంచి ఆమెకు మా అమ్మ భగవంతి మూలస్తంభంగా ఉంది. గత నెలలో ఆమెకు హార్ట్ ఎటాక్ వచ్చింది. కొన్ని రోజులుగా మేము హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నాం. కానీ, ఈ విషయాన్ని అమన్‌జోత్‌కు చెప్పలేదు. ఈ పరిస్థితుల్లో మాకు ప్రపంచకప్ విజయం ఔషధలాంటిది. మా అమ్మ ఇంటికి తిరిగి వచ్చాక అమన్‌జోత్‌తో కలిసి సంబరాలు చేసుకుంటుంది.’అని భూపిందర్ సింగ్ చెప్పుకొచ్చారు. అమన్‌జోత్ భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. పలు మ్యాచ్‌ల్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన ఆమె ఫైనల్‌లో సౌతాఫ్రికాతో కెప్టెన్ వొల్వార్ట్ ఇచ్చిన క్యాచ్ అందుకున్న తీరు హైలెట్. ఆ క్యాచ్‌తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది.






