- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముగ్గురు పాకిస్తాన్ ప్లేయర్లకు చాన్స్.. గంభీర్‌కు ఒక్క భారత ప్లేయర్ నచ్చలేదా?
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. తాను ఇప్పటివరకు ఆడిన ఆటగాళ్లతో ఆల్-టైం ప్లేయింగ్ 11 జట్టును ప్రకటించాడు.

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. తాను ఇప్పటివరకు ఆడిన ఆటగాళ్లతో ఆల్-టైం ప్లేయింగ్ 11 జట్టును ప్రకటించాడు. ఈ జట్టులో ప్రత్యర్థి ఆటగాళ్లు కూడా ఉండనున్నారు. గంభీర్ ప్రకటించిన ఈ జట్టులో.. ఆసీస్ దిగ్గజాలు అయిన గ్లెన్ మెక్ గ్రాత్, రికీ పాంటింగ్ లకు తన ప్లేయింగ్ జట్టులో చోటును కల్పించలేదు. అయితే ఈ జట్టుకు గంభీర్ ఇప్పటివరకు పేరును ప్రతిపాదించలేదు, కెప్టెన్ కూడా ఎవరనేది వెల్లడించలేదు. రాయితీ గంభీర్ ప్రకటించిన జట్టులో బ్రియాన్ లారా, ఏబీ డివిలియర్స్, ఇంజమామ్ ఉల్ హక్ లు ఉన్నారు. ఆస్ట్రేలియా, పాకిస్థాన్ నుంచి ముగ్గురేసి ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నాడు. ఓపెనర్లుగా ఆసీస్ స్టార్ బ్యాట్స్ మెన్ జోడీ అయిన ఆడమ్ గిల్క్రిస్ట్, మాథ్యూ హేడెన్ లను ఎంచుకున్నాడు. కాగా డివిలియర్స్, లారా, ఇంజమామ్ లకు వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో చోటును కల్పించాడు గంభీర్. ఈ 11 టీమ్ లో ఆల్ రౌండర్ ఆటగాళ్లుగా ఆండ్రూ సైమండ్స్, అబ్దుర్ రజాక్, ఫ్లింటాఫ్ లను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. పేసర్ బౌలర్ లుగా షోయాబ్ అక్తర్, మోర్కెల్ లను, అలాగే ఏకైక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ను జట్టులోకి తీసుకున్నాడు. కాగా న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఆటగాళ్లకు మాత్రం గంభీర్ ఆల్-టైం ప్లేయింగ్ 11 జట్టులో చోటు దక్కలేదు.
గంభీర్ ఆల్-టైం ప్లేయింగ్ 11 జట్టు:
ఆడమ్ గిల్ క్రిస్ట్, మాథ్యూ హేడెన్, ఏబీ డివిలియర్స్, బ్రియాన్ లారా, ఇంజమామ్ ఉల్ హక్, ఆండ్రూ సైమండ్స్, అబ్దుల్ రజాక్, ముత్తయ్య మురళీధరన్, ఆండ్రూ ఫ్లింటాఫ్, మోర్నీ మోర్కెల్, షోయాబ్ అక్తర్.






