IPL : ఐపీఎల్ క్రెడిట్ అంతా ఆయనదే : లలిత్ మోడీ

by Muthe.Rajitha |

ప్రస్తుతం ప్రపంచాన్ని ఐపీఎల్(IPL) క్రికెట్ ఉర్రూతలూగిస్తున్న విషయం తెలిసిందే.

IPL : ఐపీఎల్ క్రెడిట్ అంతా ఆయనదే : లలిత్ మోడీ
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం ప్రపంచాన్ని ఐపీఎల్(IPL) క్రికెట్ ఉర్రూతలూగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ లీగ్ ఫౌండర్ లలిత్ మోడీ(Lalith Modi) మాత్రం ఈ లీగ్ మీద పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఐపీఎల్ రూపు దాల్చడానికి ప్రధాన కారకులు నేషనల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్(NCP Cheif Sharad Pawar) అని పేర్కొన్నారు. నేడు ఐపీఎల్ మేనియా ప్రపంచ క్రికెట్ ప్రేమికులను పట్టి కుదిపేస్తుందంటే.. ఆ క్రెడిట్ అంతా శరద్ పవార్ కే దక్కుతుందని లలిత్ మోడీ కొనియాడారు. తనను గుడ్డిగా నమ్మి ప్రోత్సహించడంతోనే ఐపీఎల్ కల నిజమైందని తెలియజేశారు.

ఇపుడు ఐపీఎల్ లేకుండా ప్రపంచాన్ని ఊహించలేమని అన్నారు. పవార్ విజినరీ ఉన్న నాయకుడు అని, ఆ విషయాన్ని ఎవరూ మర్చిపోవద్దని సూచించారు. ఈ మేరకు లలిత్ మోడీ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. కాగా శరద్ పవార్ 2005-08 మధ్య బీసీసీఐ(BCCI) అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే లలిత్ మోడీ ఐపీఎల్ లీగ్ ను ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా క్రికెట్ ప్రేమికులను ఈ లీగ్ అలరిస్తూనే ఉంది

Next Story