- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
French Open : ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్‌గా మళ్లీ అల్కరాజే
స్పెయిన్ స్టార్ ప్లేయర్ కార్లోస్ అల్కరాజ్ అదరగొట్టాడు.

దిశ, స్పోర్ట్స్ : స్పెయిన్ స్టార్ ప్లేయర్ కార్లోస్ అల్కరాజ్ అదరగొట్టాడు. వరుసగా రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించాడు. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో వరల్డ్ నం.1 జెన్నిక్ సిన్నర్‌ను మట్టికరిపించాడు. ఐదు సెట్లలో ఫలితం తేలగా 4-6, 6-7(4-7), 6-4, 7-6(7-3),7-6(10-2) తేడాతో అల్కరాజ్ విజయం సాధించాడు. 5 గంటల 29 నిమిషాలపాటు అల్కరాజ్, సిన్నర్ మధ్య హోరాహోరీ పోరు సాగింది. మొదట సిన్నర్ ఆధిపత్యమే కొనసాగింది. వరుసగా తొలి రెండు సెట్లలో నెగ్గాడు. తొలి సెట్‌లో 10వ గేములో అల్కరాజ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి శుభారంభం చేశాడు.
రెండో సెట్‌లో అల్కరాజ్‌ను తీవ్ర పోటీ తప్పలేదు. ముందుగా వరుసగా మూడు గేములు నెగ్గి 3-0తో అలవోకగానే సెట్ గెలిచేలా కనిపించాడు. అనంతరం పుంజుకున్న అల్కరాజ్ అద్భుతమైన పోరాటంతో ఆ సెట్‌ను టై బ్రేకర్‌కు మళ్లించాడు. అయితే, అక్కడ అతనికి నిరాశ తప్పలేదు. సిన్నరే గెలిచాడు. వరుసగా రెండు సెట్లు కోల్పోవడంతో అల్కరాజ్ ఓటమి తప్పదనుకున్నారు. కానీ, అతను కమ్ బ్యాక్ ఇచ్చిన తీరు అద్భుతం. సిన్నర్‌ను నిలువరించి మూడో సెట్ గెలిచి పోటీలోకి వచ్చాడు. వరుసగా నాలుగో సెట్‌ను కూడా దక్కించుకున్నాడు. నువ్వానేనా అన్నట్టు సాగిన ఆ సెట్‌ను ట్రై బ్రేకర్‌లో నెగ్గాడు. దీంతో మ్యాచ్ నిర్ణయాత్మక ఐదో సెట్‌కు వెళ్లింది. అక్కడ కూడా పోరాటాన్నే నమ్ముకున్న అల్కరాజ్ టై బ్రేకర్‌లో ఐదో సెట్‌ను గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో సిన్నర్‌కు నిరాశ తప్పలేదు. అల్కరాజ్‌కు ఇది 5వ గ్రాండ్‌స్లామ్ టైటిల్. యూఎస్ ఓపెన్(2022), వింబుల్డన్(2023, 2024), ఫ్రెంచ్ ఓపెన్(2024, 2025) టైటిల్స్ గెలిచాడు.






