- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
French open : మరోసారి టైటిల్‌పై కన్నేసిన అల్కరాజ్.. వరుసగా రెండోసారి ఫైనల్‌కు
ఫ్రెంచ్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్, స్పెయిన్ స్టార్ ప్లేయర్ కార్లోస్ అల్కరాజ్‌కు ఎదురులేకుండా పోయింది.

దిశ, స్పోర్ట్స్ : ప్రతిష్టాత్మక టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్, స్పెయిన్ స్టార్ ప్లేయర్ కార్లోస్ అల్కరాజ్‌కు ఎదురులేకుండా పోయింది. వరుసగా రెండోసారి పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకోవడానికి అడుగుదూరంలో నిలిచాడు. సెమీస్‌లో వాకోవర్ పొంది ఫైనల్‌లో అడుగుపెట్టాడు. శుక్రవారం ఇటలీ ప్లేయర్ లొరెంజో ముసెట్టితో అల్కరాజ్ తలపడ్డాడు. అయితే, నాలుగో సెట్‌లో ముసెట్టి గాయం కారణంగా ఆట మధ్యలోనే తప్పుకున్నాడు. ఆట ఆగిపోయే సమయానికి మ్యాచ్ 4-6, 7-6(7-3), 6-0, 2-0 తో అల్కరాజే ఆధిపత్య స్థితిలో ఉన్నాడు.
అంతకుముందు అల్కరాజ్, ముసెట్టి మధ్య ఆసక్తికర పోరు సాగింది. మ్యాచ్‌లో మొదట ముసెట్టిదే ఆరంభం. అల్కరాజ్‌ను నిలువరించి తొలి సెట్ గెలిచాడు. ఆ తర్వాత కూడా పోటీనిచ్చినా అల్కరాజ్ బలంగా పుంజుకోవడంతో అతన్ని నిలువరించడం ముసెట్టితో కాలేదు. రెండో సెట్‌ను ట్రై బ్రేకర్‌లో నెగ్గిన అల్కరాజ్.. మూడో సెట్‌ను ఏకపక్షంగా సొంతం చేసుకుని 2-1తో మ్యాచ్‌లో ఆధిక్యతలోకి వెళ్లాడు. ఇక, నాలుగో సెట్‌లో రెండు గేములు నెగ్గి లీడ్‌లో కొనసాగాడు. అదే సమయంలో ముసెట్టి గాయం కారణంగా తప్పుకోవడంతో అల్కరాజ్ వాకోవర్ ద్వారా ఫైనల్‌కు చేరుకున్నాడు. ఇది అతనికి ఐదో గ్రాండ్‌స్లామ్ ఫైనల్. ఐదు గ్రాండ్‌స్లామ్ ఫైనల‌్‌కు చేరిన ఐదో యంగెస్ట్ ప్లేయర్‌గా నిలిచాడు. అలాగే, ప్రస్తుతం ఆడుతున్న వారిలో మైలురాయి సాధించిన మూడో ప్లేయర్ అల్కరాజ్. అతనికంటే ముందు జకో(37), మెద్వెదెవ్(6) ఉన్నారు. గతేడాది అల్కరాజ్ తొలిసారిగా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గాడు. ఆదివారం జరిగే ఫైనల్‌లో అతను.. జకోవిచ్ లేదా సిన్నర్‌తో తలపడనున్నాడు.
కొత్త క్వీన్ ఎవరో?
ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్‌కు కొత్త చాంపియన్ రానుంది. నేడు జరిగే ఫైనల్‌లో వరల్డ్ నం.1 సబలెంక, వరల్డ్ నం.2 కోకా గాఫ్ తలపడనున్నారు. వీరిద్దరూ ఇప్పటి వరకు ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలువలేదు. కాబట్టి, ఎవరూ గెలిచినా కొత్త చాంపియనే. గాఫ్‌కు ఇది రెండో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్. 2022లో టైటిల్ పోరుకు చేరుకున్నా స్వైటెక్ చేతిలో ఓడిపోయింది. మరోవైపు, సబలెంకకు ఇదే తొలి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ పోరు. క్వార్టర్స్‌లో పారిస్ ఒలింపిక్స్ చాంపియన్ క్వెన్ జెంగ్, సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్ స్వైటెక్‌ను ఓడించి సబలెంక ఆత్మవిశ్వాసంతో ఉన్నది. మరోవైపు, గాఫ్ కూడా టోర్నీ ఆద్యంతం ఆకట్టుకుంది. మరి, ఎవరు తొలి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను దక్కించుకుంటారో.






