- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
Akash Deep : విరాట్ బ్యాట్.. ఎవరైనా వద్దంటారా..? : ఆకాశ్‌దీప్

దిశ, స్పోర్ట్స్ : విరాట్ కోహ్లీ బ్యాట్ ఇస్తానంటే ఎవరైనా వద్దంటారా అని భారత పేస్ బౌలర్ ఆకాశ్ దీప్ అన్నాడు. బ్రిస్బేన్ టెస్ట్‌లో భారత్ ఫాలో ఆన్ గండం నుంచి బయట పడాలంటే 47 పరుగులు చేయాల్సి ఉండగా.. బుమ్రా, ఆకాశ్ దీప్‌లు వీరోచితంగా పోరాడిన విషయం తెలిసిందే. ఆకాశ్ దీప్(31) కీలక పరుగులు చేయడంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. విరాట్ కోహ్లీ తనకు బ్యాట్ ఇవ్వడంపై గురువారం ఆకాశ్‌దీప్ పీటీఐతో మాట్లాడాడు. ‘అవును ఎంఆర్ఎఫ్ లోగో ఉన్న బ్యాట్ కోహ్లీదే. విరాట్ స్వయంగా వచ్చి నీకు బ్యాట్ కావాలా అని అడిగాడు. మీ బ్యాట్ ఈ ప్రపంచంలో ఎవరైనా వద్దంటారా అన్నాను. మ్యాచ్ సమయంలో కోహ్లీ దృష్టంతా ఆటపైనే ఉంటుంది. కానీ కోహ్లీయే స్వయంగా నా దగ్గరికి వచ్చి బ్యాట్ కావాలా అని అడిగాడు.’ అని ఆకాశ్‌దీప్ అన్నాడు. భారత్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 1-3 తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఐదో టెస్ట్‌లో ఆకాశ్ దీప్ ఆడలేదు.