- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందుకే డకెట్‌పై చేతులు వేశా : ఆకాశ్ దీప్
ఇంగ్లాండ్‌తో ఆఖరి టెస్టులో భారత యువ పేసర్ ఆకాశ్ దీప్ ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్ డకెట్‌ను అవుట్ చేసిన సమయంలో వ్యవహరించిన తీరుపై విమర్శలు వచ్చాయి.

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో ఆఖరి టెస్టులో భారత యువ పేసర్ ఆకాశ్ దీప్ ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్ డకెట్‌ను అవుట్ చేసిన సమయంలో వ్యవహరించిన తీరుపై విమర్శలు వచ్చాయి. డకెన్‌ను అవుట్ చేసిన తర్వాత ఆకాశ్.. డకెట్‌పై భుజాలపై చేతులు వేసి ఏదో మాట్లాడుతూ సెండాఫ్ ఇవ్వడంపై చర్చనీయాంశమైంది. పలువురు భారత మాజీ క్రికెటర్లు కూడా ఆకాశ్ వ్యవహరించిన తీరును విమర్శించారు. తాజాగా ఆ ఘటనపై ఆకాశ్ దీప్ స్పందించాడు. తననుఅవుట్ చేయలేనని డకెట్ రెచ్చగొట్టడంతోనే అలా వ్యవహరించాల్సి వచ్చిందన్నాడు. ‘డకెట్‌పై మంచి రికార్డు ఉంది.కొన్ని సార్లు అవుట్ చేశాను. లెఫ్ట్ హ్యాండర్లపై నాకు మంచి రికార్డు ఉంది. ఆ రోజు అతను అసాధారణమైన షాట్స్‌తో నా లైన్, లెంగ్త్ దెబ్బతినేలా ప్రయత్నించాడు. అప్పుడు అతను నాతో ‘ఈరోజు నాది. నన్ను అవుట్ చేయలేవు.’అని రెచ్చగొట్టాడు. వాస్తవానికి ఒక్క బ్యాటర్ క్రీజు మీద కదులుతూ అలాంటి షాట్స్ ఆడితే లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్ చేయడం కష్టమవుతోంది. ఇంగ్లాండ్ దూకుడుగా ఆడుతోంది. మాకేం ఓ వికెట్ కావాలి. మేము మోస్తరు స్కోరును కాపాడుకోవాలి. అందుకు వికెట్లు తీయాలి. ఆ సమయంలోనే అతన్ని అవుట్ చేశాను. అప్పుడు నేను నవ్వుతూ డకెట్‌తో‘నువ్వు బంతిని మిస్ చేశావు. నేను అవుట్ చేశాను. ప్రతిసారి నువ్వే గెలవవు. ఈ సారి నేను గెలిచాను.’ అని చెప్పాను. అతను నాతో అన్నందుకే అలా చేశాను. ఇదంతా మంచి స్ఫూర్తితోనే జరిగింది. ఎలాంటి సమస్య లేదు.’అని ఆకాశ్ దీప్ చెప్పుకొచ్చాడు. కాగా, ఇంగ్లాండ్ పర్యటనలో ఆకాశ్ దీప్ ఆకట్టుకున్నాడు. మూడు మ్యాచ్‌లు ఆడిన అతను 13 వికెట్లు తీశాడు.






