- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గిల్‌పై వేటు.. ఆ ముగ్గురు సెలెక్టర్లు వ్యతిరేకించారా?
టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్ శుభమన్ గిల్‌ను టీ20 ప్రపంచకప్-2026కు ఎంపిక చేయకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్ శుభమన్ గిల్‌ను టీ20 ప్రపంచకప్-2026కు ఎంపిక చేయకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. జట్టు సమతుల్యత కోసం అతన్ని పక్కనపెట్టామని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ చెప్పినా.. పేలవ ఫామ్ ప్రధాన కారణమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, జట్టు ఎంపిక సమయంలో గిల్ గురించి చాలా డిస్కషనే జరిగినట్టు తెలుస్తోంది. బీసీసీఐ సెలెక్షన్ కమిటీకి అజిత్ అగార్కర్ చైర్మన్‌గా ఉండగా శివ్ సుందర్ దాస్, అజయ్ రత్నా, ఆర్పీ సింగ్, ప్రజ్ఞాన్ ఓజా సెలెక్టర్లుగా ఉన్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్.. గిల్ వైపు మొగ్గచూపినట్టు ఓ జాతీయ మీడియా కథనం పేర్కింది. కానీ, ఆర్పీ సింగ్, ప్రజ్ఞాన్ ఓజాతోపాటు మరో సెలెక్టర్ అందుకు వ్యతిరేకించినట్టు తెలుస్తోంది. సెలెక్షన్ కమిటీ మీటింగ్‌కు ముందే ఆ ముగ్గురు నిర్ణయం తీసుకున్నారని, గిల్ ప్రస్తుతం టీ20లకు సరిపోడని వారు భావించినట్టు సదరు మీడియా సంస్థ తెలిపింది. సెలెక్షన్ కమిటీలో మెజారిటీగా ముగ్గురు గిల్ ఎంపికను వ్యతిరేకించడంతో అగార్కర్‌ను గిల్‌ను పక్కనపెట్టడం తప్ప మరో మార్గం లేకపోయింది. టీ20 ప్రపంచకప్ జట్టును ప్రకటించడానికి కొన్ని నిమిషాలే ముందే గిల్‌కు అతన్ని ఎంపిక చేయడం లేదని తెలియజేసినట్టు సదరు మీడియా సంస్థ వెల్లడించింది. కొంతకాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న గిల్ ఈ ఏడాది అతను ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. 15 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 291 పరుగులే చేశాడు.






