- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీసీఐకి అగార్కర్ రిక్వెస్ట్..ఇంకా పని చేస్తా, ఛాన్స్ ఇవ్వండి !
2027 వన్డే ప్రపంచ కప్ వరకు భారత సెలక్టర్ గా ఛాన్స్ ఇవ్వండని బీసీసీఐ కోరాడు అజిత్ అగార్కర్.

దిశ, వెబ్ డెస్క్: భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీ కాలం అతి త్వరలోనే ముగియనుంది. జూన్ మాసంలో ఆయన పదవీ కాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో మరికొన్ని నెలల పాటు తనకు చీఫ్ సెలెక్టర్ గా అవకాశం ఇవ్వాలని బీసీసీఐని రిక్వెస్ట్ చేశాడట అజిత్ అగార్కర్. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఛాన్స్ ఇస్తే సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని బీసీసీఐని అజిత్ అగార్కర్ కోరినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
2027 వన్డే వరల్డ్ కప్ వరకు పొడిగించే ఛాన్స్ ?
అయితే అజిత్ అగార్కర్ రిక్వెస్ట్ పై ఇప్పటి వరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకోలేదని సమాచారం అందుతోంది. దీనిపై మరో వారం రోజుల్లో ప్రకటన వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం అజిత్ అగార్కర్ పదవీ కాలం 2027 వన్డే వరల్డ్ కప్ వరకు పొడిగించే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
2023 నుంచి చీఫ్ సెలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్నారు అజిత్ అగార్కర్. 2025 సంవత్సరంతో గడువు అతనిది ముగియగా, మరో ఏడాది అవకాశం ఇచ్చింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అజిత్ అగార్కర్ హయాంలోనే టీ20 వరల్డ్ కప్ 2024, 2026, మొన్నటికి మొన్న ఛాంపియన్ ట్రోఫీ 2025 టైటిల్స్ దక్కించుకుంది భారత జట్టు. ఈ నేపథ్యంలోనే మరో అవకాశం కూడా అజిత్ అగార్కర్ కు రాబోతున్నట్లు తెలుస్తోంది. గౌతమ్ గంభీర్ కూడా 2027 వన్డే వరల్డ్ కప్ వరకు హెడ్ కోచ్ గా కొనసాగనున్నాడు.






