బీసీసీఐలో క‌ల‌క‌లం..అజిత్ అగార్క‌ర్ రాజీనామా? ఇక అన్ని మంచిరోజులే !

by velandi.Saikiran |

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మొన్నటి వరకు జరిగిన వన్డే సిరీస్ లో గిల్ సేన అత్యంత దారుణంగా విఫలమైన

బీసీసీఐలో క‌ల‌క‌లం..అజిత్ అగార్క‌ర్ రాజీనామా? ఇక అన్ని మంచిరోజులే !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మొన్నటి వరకు జరిగిన వన్డే సిరీస్ లో గిల్ సేన అత్యంత దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్, ప్రారంభాని కంటే ముందే భారత సెలక్షన్ కమిటీ పైన తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. హర్షిత్ రాణాను పదేపదే సెలెక్ట్ చేయడంపై కూడా చాలా మంది దారుణంగా ట్రోలింగ్ చేశారు. బుమ్రా, రవీంద్ర జడేజాను ఆసీస్ తో వన్డే సిరీస్ నుంచి తప్పించడంపై కూడా విమర్శలు వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో బీసీసీఐలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

సెలక్షన్ కమిటీ చైర్మన్ గా ఉన్న అజిత్ అగార్కర్ సంచలన నిర్ణయం తీసుకున్నారట. ఈ దారుణమైన ట్రోలింగ్ భరించలేక, రాజీనామా చేసేందుకు అజిత్ అగార్కర్ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. టీమిండియా వర్సెస్ ఇండియా మధ్య టి20 సిరీస్ పూర్తయిన తర్వాత ఆయన రాజీనామా చేస్తారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇక అజిత్ అగార్కర్ రాజీనామా చేస్తే, రవి శాస్త్రికి ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అతను అయితేనే టీమ్ ఇండియాకు మంచి ప్లేయర్లను సెలెక్ట్ చేస్తారని అంటున్నారు. రవి శాస్త్రి రంగంలోకి దిగితే, రోకో కాంబోను 2027 వ‌రల్డ్ క‌ప్ లో చూడొవ‌చ్చ‌ని కామెంట్స్ చేస్తున్నారు. క్లిక్

Next Story