IPL 2026: డేంజ‌ర్ ప్లేయ‌ర్ల‌ను వ‌దిలేస్తున్న కేకేఆర్‌..కొత్త కెప్టెన్ వ‌చ్చేస్తున్నాడు!

by velandi.Saikiran |   (  Updated:2025-11-12 00:30:49  IST  )

కేకేఆర్ కెప్టెన్ గా వ్యవహరించిన అజింక్య రహానేతో పాటు వెంకటేష్ అయ్యర్ ను వేలంలో వదిలేయాలని కేకేఆర్ డిసైడ్ అయినట్లు

IPL 2026: డేంజ‌ర్ ప్లేయ‌ర్ల‌ను వ‌దిలేస్తున్న కేకేఆర్‌..కొత్త కెప్టెన్ వ‌చ్చేస్తున్నాడు!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో వ‌చ్చే నెల 15వ తేదీన మినీ వేలం జరగనున్న సంగతి తెలిసిందే. ముంబై వేదికగా ఈ ఈవెంట్ జరగనుందట. అయితే ఈ మినీ వేలం కంటే ముందే ట్రేడ్, రిటెన్షన్ ప్రక్రియ కొనసాగుతోంది. నవంబర్ 15వ తేదీ లోపు రిటైన్ చేసుకునే ప్లేయర్ల లిస్టును ప్రతి జట్టు ప్రకటించాల్సి ఉంటుంది. దీంతో రిటెన్షన్ ప్రక్రియపై ఫోకస్ చేశాయి 10 ఫ్రాంచైజీలు. ఇక ఇందులో భాగంగానే కేకేఆర్ జట్టు ఇద్దరు ప్లేయర్లను వదిలేసి మిగిలిన స్టార్ ఆటగాళ్లను రిటైన్ చేసుకోవాలని డిసైడ్ అయింది.

కేకేఆర్ కెప్టెన్ గా వ్యవహరించిన అజింక్య రహానేతో పాటు వెంకటేష్ అయ్యర్ ను వేలంలో వదిలేయాలని కేకేఆర్ డిసైడ్ అయినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వాళ్ల స్థానంలో మరో ఇద్దరు యంగ్ స్టార్లను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. అదే సమయంలో ఢిల్లీకి చెందిన కేఎల్ రాహుల్ ను ట్రేడ్ ప్రక్రియ ద్వారా కొనుగోలు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ ట్రేడ్ ప్రక్రియ సక్సెస్ అయితే కేకేఆర్ జట్టు కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ను నియామకం చేసే ఛాన్సులు ఉన్నాయి. ఒకవేళ రాహుల్ కేకేఆర్ లోకి రాకపోతే, రింకు సింగ్ కు కెప్టెన్సీ వచ్చే ఛాన్స్ లో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Next Story