- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AirAsia-SRH: ఆరెంజ్ ఆర్మీ దూసుకెళ్తోంది! సన్ రైజర్స్ లోగోతో ఎయిర్ ఏషియా ఫ్లైట్
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు వివిధ స్టేడియాలకు ప్రయాణించేందుకు సరికొత్త విమానాన్ని రూపొందించిన విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు ఆటగాళ్లు వివిధ స్టేడియాలకు ప్రయాణించేందుకు సరికొత్త విమానాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. ఈ విమానాన్ని (AirAsia) ఎయిర్ ఏషియా నడుపుతోంది. ఇందులో భాగంగానే విమానాన్ని సన్ రైజర్స్ లోగోతో తలుక్కున మెరుస్తోంది. ఈ ఎయిర్ ఏషియా విమానానికి సంబంధించిన ఫోటోను హైదరాబాద్ జట్టు తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆరెంజ్ ఆర్మీ కొత్త విమానం బాగుందని, మన టీమ్ లానే విమానం దూసుకెళ్తోంది.. అని నెటిజన్లు ప్రశంసలు తెలియజేస్తున్నారు. కాగా, బడ్జెట్ ఎయిర్ లైన్స్ అయిన ఎయిర్ ఏషియా భాగస్వామిగా సన్ రైజర్స్ హైదరాబాద్ వ్యూహాత్మక భాగస్వామ్యంలోకి ప్రవేశించిన విషయం విదితమే.
ఈ ఐపీఎల్ (IPL) సీజన్ ముగిసేంత వరకు ఎయిర్ ఏషియాతో హైదరాబాద్ జట్టు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా మ్యాచ్‌లు ఆడే వేదిక వద్దకు ఎయిర్ ఏషియా విమానం ఆటగాళ్లను తీసుకెళ్తుంది. ఇతర టీమ్‌ల ప్లేయర్లు కూడా విమానాల్లోనే ఇతర స్టేడియాలకు వస్తుంటారు. ఇక, ఈ ఐపీఎల్లో సన్‌రైజర్స్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. 6 మ్యాచ్ ల్లో 2 విజయాలు, 4 ఓటములతో లీగ్ టేబుల్లో 9వ స్థానంలో కొనసాగుతోంది. వరుసగా 4 ఓటముల తర్వాత పంజాబ్ కింగ్స్ పై అద్భుతమైన విజయం సాధించి ప్లే ఆఫ్ రేసులోకి వచ్చింది.






