- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐ-లీగ్ కాదు.. ఇండియన్ ఫుట్‌బాల్ లీగ్
by Phanindra |
ఐ-లీగ్ కాదు.. ఇండియన్ ఫుట్‌బాల్ లీగ్. రీబ్రాండ్ చేసినట్లు ఏఐఎఫ్ఎఫ్ అధికారిక ప్రకటన.

X
దిశ, స్పోర్ట్స్: ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) కీలక ప్రకటన చేసింది. ఐ-లీగ్‌ను ఇండియన్ ఫుట్‌బాల్ లీగ్‌గా రీబ్రాండింగ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఏఐఎఫ్ఎఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆన్‌లైన్ మీటింగ్‌లో ఈ నిర్ణయానికి ఆమోదం లభించింది. ఈ ఏడాది జరిగే సీజన్ నుంచే ఈ మార్పు అమల్లోకి వస్తున్నట్లు ఏఐఎఫ్ఎఫ్ తెలిపింది. ఇండియన్ సూపర్ లీగ్, ఇండియన్ ఫుట్‌బాల్ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్‌కు కూడా ఈ విషయాన్ని తెలియజేసినట్లు ఏఐఎఫ్ఎఫ్ వెల్లడించింది. జనవరిలో ఏఐఎఫ్ఎఫ్ అధికారులు, క్లబ్ ప్రతినిధుల సమావేశంలో ఈ ప్రతిపాదన వచ్చింది. దీన్ని ఏఐఎఫ్ఎఫ్ గురువారం నాడు అధికారికంగా ఆమోదించింది.
Next Story






