- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
WTC Final: మార్క్రమ్ సరికొత్త ఘనత.. 29 ఏళ్ళ తర్వాత
WTC ఫైనల్ మ్యాచ్ 2025 ( WTC 2025 Final) చివరి దశకు వచ్చింది. మరో 69 పరుగులు చేస్తే సౌత్ ఆఫ్రికా (South Africa) గ్రాండ్ వ

దిశ, వెబ్ డెస్క్ : WTC ఫైనల్ మ్యాచ్ 2025 ( WTC 2025 Final) చివరి దశకు వచ్చింది. మరో 69 పరుగులు చేస్తే సౌత్ ఆఫ్రికా (South Africa) గ్రాండ్ విక్టరీ కొడుతుంది. దీంతో WTC 2025 ఛాంపియన్ గా నిలుస్తుంది సౌత్ ఆఫ్రికా. అయితే ఇలాంటి నేపథ్యంలో సౌత్ ఆఫ్రికా స్టార్ ఆటగాడు ఐడెన్ మార్క్‌రమ్ ( Aiden Markram) అరుదైన రికార్డు నమోదు చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో సెంచరీ చేసిన ఐడెన్ మార్క్‌రమ్... 29 సంవత్సరాల రికార్డును బ్రేక్ చేశాడు.
29 సంవత్సరాల తర్వాత ఐసీసీ ఫైనల్స్ లో ఆస్ట్రేలియా జట్టుపై సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు ఐడెన్ మార్క్‌రమ్. గతంలో 1996 సంవత్సరంలో... శ్రీలంక క్రికెటర్ అరవింద డిసిల్వా... ఒక్కడే ఆస్ట్రేలియాపై సెంచరీ నమోదు చేసుకున్నాడు. 1996 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఈ సంఘటన జరిగింది. అంతేకాదు ఐసీసీ ఫైనల్ మ్యాచ్ లో సెంచరీ నమోదు చేసిన తొలి దక్షిణాఫ్రికా ఆటగాడిగా కూడా చరిత్ర సృష్టించాడు ఐడెన్ మార్క్‌రమ్.
ఇది ఇలా ఉండగా ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ లో ఐడెన్ మార్క్‌రమ్ 102 పరుగులు చేశాడు. ప్రస్తుతం క్రీజులో ఉన్న ఐడెన్ మార్క్‌రమ్ ... జట్టు విజయం కోసం ఎంతో కష్టపడుతున్నాడు. ఈ మ్యాచ్ లో మరో 69 పరుగులు.. సాధిస్తే చాంపియన్ గా నిలుస్తుంది దక్షిణాఫ్రికా. ఐడెన్ మార్క్‌రమ్ తో పాటు కెప్టెన్ బవుమా కూడా 65 పరుగులతో రాణిస్తున్నాడు.






