అవును.. నా బ్యాటులో ఏఐ చిప్ ఉంది : వైభవ్ సూర్యవంశీ

by Harish |   (  Updated:2026-04-29 19:49:38  IST  )

అవును.. నా బ్యాటులో ఏఐ చిప్ ఉంది : వైభవ్ సూర్యవంశీ
X

దిశ, స్పోర్ట్స్ : రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన బ్యాటులో ఏఐ చిప్ ఉందన్న ఆరోపణలపై మౌనం వీడాడు. ‘అవును. నా బ్యాటులో ఏఐ చిప్ ఉంది. కానీ నేను పెట్టలేదు. ఆ దేవుడే పెట్టాడు. నీ బ్యాటులో ఏదో పెట్టానని నాకు చెప్పాడు. దాన్ని నేను వాడుకుంటున్నా’అని సూర్యవంశీ చమత్కారం చేశాడు. ఆ వీడియోను రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. గతేడాది అరంగేట్రంతోనే సంచలనాలు క్రియేట్ చేసిన వైభవ్ ఈ సీజన్‌లోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు. ప్రతి మ్యాచ్‌లోనూ క్రీజులో ఉన్నంత సేపు ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. ఇటీవల సన్‌రైజర్స్‌పై 37 బంతుల్లోనే 103 రన్స్ చేశాడు. దీంతో పాక్‌కు చెందిన విశ్లేషకులు నౌమన్ నియాజ్.. అతని బ్యాటులో ఏఐ చిప్ ఉందంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. ‘అతనో అద్భుతం. అతని బ్యాట్‌ను పరీక్షించాలి. అతను ఏఐ చిప్ వాడుతున్నాడు’అని కామెంట్స్ చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్ అవ్వగా.. తాజాగా వైభవ్ స్పందించాడు.


Next Story